కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లాంటి హీరోలతో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో సంవత్సరాలు అద్భుతమైన కెరియర్ ను తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగించింది. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రైస్తవుల నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే సోనాలి బింద్రే పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దాదాపుగా గుడ్ బై చెప్పేసింది. ఈమె ప్రస్తుతం కూడా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆ మధ్య కాలంలో ఈమె సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈమె సినిమా ఇండస్ట్రీలో హీరో , హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ ఉన్నాయి అని అనేక రూమర్స్ బయటకు వస్తాయి. 

వాటిని జనాలు కూడా నమ్ముతారు. కాకపోతే అందులో చాలా వరకు అబద్ధం. వాటిని సినిమా ప్రమోషన్ల కోసం నిర్మాతలే సృష్టిస్తూ ఉంటారు. నాపై కూడా ఇలాంటి రూమర్స్ ను సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా నిజం లేదు. అప్పట్లో ఈ రూమర్స్ ఇండస్ట్రీలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. అది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఇకపోతే నేను ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగాను అని ఈమె చెప్పింది. ఇక సోనాలి నటించిన తెలుగు మూవీ లలో ఇంద్ర , ఖడ్గం మూవీ లు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sb