తాజాగా 14 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సారి ఇందులో మన తెలుగు వారికి కూడా భారీగానే అవార్డ్ లు దక్కాయి. మరి ఏ చిత్రాలకి ... ఎవరికి ఈ సారి అవార్డ్ లు దక్కాయి అని వివరాలను తెలుసుకుందాం.

అందాల రాక్షసి మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నవీన్ చంద్ర గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీ లో కేవలం హీరో పాత్రలో మాత్రమే కాకుండా అనేక పాత్రలలో నటిస్తూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితమే మంత్ ఆఫ్ మధు అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ లో ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మంత్ ఆఫ్ మధు చిత్రం లో తన అద్భుతమైన నటనకి గానూ నవీన్ చంద్ర ఉత్తమ నటుడు అవార్డు ను గెలుచుకున్నారు.


స్పెషల్ జ్యూరీ కేటగిరిలో ఉస్తాద్ మూవీ అవార్డు ను గెలుచుకోగా ... క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ఉత్తమ బాలనటి అవార్డు ను గెలుపొందింది. గాంధీ తాత చెట్టు లో తన నటనకు ఈ అవార్డు లభించింది.  ఇక వీరితో పాటు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్న నటీమణులలో ఒకరు అయినటువంటి కామాక్షి భాస్కర్ల కి కూడా అవార్డు దక్కింది. మా ఊరి పొలిమేర 2 చిత్రం లో తన నటనకు గానూ  ఉత్తమ నటి జ్యూరీ అవార్డు ను కామాక్షి గెలుచుకున్నారు. ఇలా 14 వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు వారికి కూడా అవార్డులు భారీగానే దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kb