తమిళ స్టార్ హీరోయిన్ గౌతమి గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు.ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఆమె.. తన పెదనాన్న కొడుకు నిర్మించిన దయామయుడు ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది.ఆ తర్వాత ఈమె మాత్రం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అయితే అప్పట్లో గౌతమి రజినీ కాంత్‌, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోయిన్ల సరసన నటించి, అప్పటికే అక్కడ స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న రేవతి, భానుప్రియ లాంటి వారిని కూడా వెనక్కు నెట్టేసింది. కేవలం వెండితెర పైన మాత్రమే కాదు.. ఇటు బుల్లితెరపై కూడా రాణించింది.  

అంతేకాదు ఇందిరా అనే పెద్ద సీరియల్ లో ఆమె లీడ్ రోల్ చేసింది. ఇక బుల్లితెరపై కొన్ని ప్రత్యేక షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. 1998లో ఆమె పెండ్లి కూడా చేసుకుంది. పెళ్లయిన కొంతకాలం తర్వాత అంటే 1999లోనే భర్తతో విడాకులు తీసుకుంది.  ఆమె విడాకులు తీసుకున్నప్పటికీ సినిమాల్లో నటించడం మాత్రం ఆపలేదు. మెల్లగా కమల్ హాసన్‌తో పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది.అయితే ఇద్దరూ కలిసి పరస్పర అంగీకారంతో 2004 నుంచి 2016వరకు సహజీవనం సాగించారు.  అంతేకాదు వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.  

అయితే కొంతకాలం క్రితం గౌతమి కమల్ హాసన్ పై కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. అది ఏంటంటే కమల్ హాసన్ శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని వదిలేశాడని, తనను మోసం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. కాగా ఈ కామెంట్లు అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి.అయితే 1998లో గౌతమి పెండ్లి చేసుకున్న భర్త మనందరికీ సుపరిచితులే. ఇక ఆయనెవరో కాదండోయ్‌.. భారతీయ ఫైనాన్షియల్ అనలిస్ట్ సందీప్ భాటియా. అయితే ఆయన ప్రతిరోజు బుల్లితెరపై అనలైసిస్ లో పాల్గొంటూనే ఉన్నారు.కాగా 1999లోనే సుబ్బలక్ష్మీ అనే కూతురు జన్మించగా.. ప్రస్తుతం ఆమెతో కలిసి ఉంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: