అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో రకుల్ ప్రీతిసింగ్ ,కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ సంగీతాన్ని అందించారు. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో విలన్ గా నటించారు. ఇక శ్రీకాంత్ తో సహా కొంతమంది నటీనటుల ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా 2016 సంవత్సరం లో ఏప్రిల్ 22 న విడుదలై మొదటిరోజే మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ ని ఎలా చూపించాలో అలా చూపించారు బోయపాటి శ్రీను. అల్లు అర్జున్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ చేసింది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1). నైజాం-19.12 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-10.73 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-8.5 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-5.15 కోట్ల రూపాయలు.
5). వేస్ట్-4.52 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-5.37 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-4.8 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-2.32 కోట్ల రూపాయలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..59.34 కోట్ల రూపాయలు.
10). కేరళ-3.4 కోట్ల రూపాయలు.
11). కర్ణాటక-6.25 కోట్ల రూపాయలు.
12). ఓవర్సీస్-3.99 కోట్ల రూపాయలు.
13). రెస్ట్-1.25 కోట్ల రూపాయలు.
14). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..73.87 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

సరైనోడు సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే. రూ.53.4 కోటి రూపాయల బిజినెస్ జరగగా.. ఈ సినిమా ఫుల్ రన్ టైమ్ ముగిసేసరికి.. రూ.73.87 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఈ సినిమా కొన్న బయ్యర్లకు ఏకంగా.. రూ.20.47 కోటి రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది. దీంతో అల్లు అర్జున్ కెరీర్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అంతే కాకుండా అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమాగా కూడా ఈ చిత్రం రాబట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: