ఓ పక్క శ్రీను వైట్ల డైరక్షన్ లో ఢీ అండ్ ఢీ సినిమా చేస్తున్న మంచు విష్ణు తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేశారు. సూర్య డైరక్షన్ లో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈ సినిమాకు కోనా వెంకట్ కథ అందించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. లాస్ట్ ఇయర్ మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచు విష్ణు ఈసారి జిన్నగా వస్తున్నాడు.

కోనా వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు అంటే సినిమాపై అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. డైరక్టర్ సూర్య కూడా శ్రీను వైట్ల, మురుగదాస్ ల దగ్గర కో డైరక్టర్ గా చేసిన అనుభవం ఉంది. కాబట్టి మంచు విష్ణుకు ఈ జిన్నాతో మంచి హిట్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను ఏవిఏ ఎంటర్టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ ని వెరైటీగా తన మీద తానే పంచులేసుకుంటూ మంచు విష్ణు చేసిన వీడియో ఆడియెన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

మాస్ హీరోగా కాకుండా ఢీ, దేనికైనా రెడీ లాంటి కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మంచు విష్ణు ఈమధ్య అతను చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ఈ క్రమంలో కోనా వెంకట్ తో కలిసి ఈసారి హిట్ టార్గెట్ తో వస్తున్నాడు. అందుకే జిన్నా మూవీ ఎనౌన్స్ మెంట్ నుండి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమా తిరుపతి పరిసర ప్రాంతాల్లో సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా తప్పకుండా మంచు విష్ణు కెరియర్ మళ్లీ బిజీ అయ్యేలా చేస్తుందేమో చూడాలి. మంచు బాబు జోష్ చూస్తుంటే కథ బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. మరి అదే జోష్ రిజల్ట్ కూడా కనిపిస్తుందా అన్నది సినిమా చూస్తేనే కానీ చెప్పలేం.


మరింత సమాచారం తెలుసుకోండి: