రాహుల్ రవీంద్రన్, చిన్మయి దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్ళు  మన అందరికీ బాగా సుపరిచితులే.అయితే  రవీంద్రన్, చిన్మయి సోషల్ మీడియాలో ఒక శుభవార్తను షేర్ చేశారు. ఇక అదేంటంటే తమకు కవలలు జన్మించినట్టు పేర్కొన్నారు.అంతేకాదు  పిల్లలు ఇద్దరికీ ఏం పేర్లు పెట్టారో కూడా చెప్పారు.వారి పిల్లలకి పెట్టిన పేర్లు ఏంటంటే దృప్త మరియు శర్వాస్  చిన్మయి, రాహుల్ పిల్లల పేర్లు. అజ్తే వారికి కవలల్లో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి అని కూడా చిన్మయి పేర్కొన్నారు.ఇకపోతే చిన్మయి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే చాలా మంది సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చారా?

 అని అడుగుతున్నారట.అయితే  ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ మెసేజ్‌లు చేస్తున్నారని చిన్మయి తెలపడం జరిగింది.తను ఏమన్నారంటే....''నేను గర్భవతిగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయని కారణంగా చాలా మంది సరోగసీనా? అని అడుగుతున్నారు.ఇకపోతే  నన్ను నేను కాపాడుకుంటున్నాను కాబట్టి... నాకు అత్యంత సన్నిహితులకు మాత్రమే అసలు విషయం తెలుసు. అయితే నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం, నా స్నేహితుల విషయంలో ఇంతకు ముందు, ఇప్పుడు, ఎప్పుడూ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇక చాలా రోజుల వరకూ మా పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోకి రావు.

 అంతేకాదు ఒకవేళ మీరు నిజంగా తెలుసుకోవాలని అనుకుంటే... సిజేరియన్ జరుగుతున్నప్పుడు నేను భజన కీర్తన పాడాను.అంతేకాదు ఆ ప్రేమను పొందాను.ఇక  ఇప్పటికి ఇది చాలు.ఇది ఇక పక్కన పెట్టండి... దీని గురించి తర్వాత చెబుతా'' అని చిన్మయి పేర్కొన్నారు. అయితే రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపాద వివాహం 2014లో జరిగింది.ఇదిలావుంటే తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో చిన్మయి అనేక పాటలు పాడారు.అంతేకాక  అలాగే, సమంత సహా అగ్ర కథానాయికలకు డబ్బింగ్ చెప్పారు.ఇకపోతే  'అందాల రాక్షసి'తో హీరోగా అందుకున్న రాహుల్ రవీంద్రన్, ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించారు.కాగా 'శ్రీమంతుడు' సహా కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. పోతే 'చిలసౌ'తో దర్శకుడిగా మారిన ఆయన, ఆ తర్వాత నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' తీశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: