* కుప్పలుగా నోట్ల కట్టలు..

* అధికారం కావాలంటే డబ్బే ప్రధానమా...

•డబ్బు మోజులో బలయ్యేది ప్రజలేనా..


మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రేపటితో ప్రచార కార్యక్రమాలు కూడా ముగియనున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రజలను ఎలాగైనా సరే తమ వైపు తిప్పుకోవడానికి డబ్బు ఆశ చూపిస్తున్నారు.. నోటుకు ఓటు కాన్సెప్ట్ తో ఊరురా .. గడపగడపకు వెళ్లి ప్రతి ఓటర్ కు డబ్బు ఎరగా వేసి.. తమ వైపు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు.. ప్రస్తుతం కూటమిలో భాగంగా టిడిపి, జనసేన, బిజెపి పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలని ముందుకు వెళ్తుండగా.. మరొకవైపు మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీ వైసీపీ నేతలు.. అయితే ఇప్పుడు చివరి క్షణం ఏమైందో తెలియదు కానీ డబ్బును కుప్పలుగా గుమ్మరిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రత్యేకించి కుప్పం గురించి ఇక్కడ ఒక వార్త హల్చల్ చేస్తోంది.. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఏకంగా రూ.300 కోట్లు ఇరు పార్టీల వారు గుమ్మరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కుప్పంలో రెండు ప్రధాన పార్టీలు ఈసీ నిబంధనలను గాలిలో కలిపి.. ఎన్నికల కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా కుప్పంలో అటు టిడిపి,  ఇటు వైసిపి రెండు ప్రధాన పార్టీలు చేరో  రూ.150 కోట్లు చొప్పున మొత్తం రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.. బహుశా గతంలో మునిపెన్నడూ లేని విధంగా ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి అంటూ స్థానికులు కూడా చెబుతున్నారు..ఇప్పటికే ఒక పార్టీ ఓటుకు రూ .4వేలు చొప్పున పంపిణీ మొదలు పెట్టేసింది. డిమాండ్ ను బట్టి ఓటుకు రూ .5000 కూడా ఇచ్చే పరిస్థితి పలు ప్రాంతాలలో ఏర్పడింది.. ఇక ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు ఎలాగైనా సరే కుప్పం వశం చేసుకోవడానికి పోటీపడి మరీ ఓట్లు కొనుగోలు వేటలో పడ్డారు.


గతంలో టిడిపి ఓటర్లకు మొక్కుబడిగా ఎంతో కొంత ముట్టజెప్పి గంపగుత్తుగా ఓట్లు వేయించుకునేవారు.. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది.. కుప్పంలో ఎప్పుడూ లేనివిధంగా ఓటుకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది.. టిడిపికి దీటుగా వైసిపి కూడా సవాల్ విసురుతోంది. బాబును ఓడించమే లక్ష్యంగా పావులు కదుపుతోంది... అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపిని మట్టి కరిపించిన అనుభవం ,  ఈ చేదు జ్ఞాపకాలతో టీడీపీ ఏమవుతుందోనని భయపడుతోంది..అందుకే గతంలో ఎప్పుడూ లేనివిధంగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా కుప్పంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు.. ఏమాత్రం తేడా రాకూడదని పార్టీ నాయకులు,  కార్యకర్తలకు ఆమె దిశా నిర్దేశం చేస్తున్నారు.. ఇక అందులో భాగంగానే కార్యకర్తలకు ఓటర్లలో మంచి గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. మరొకవైపు తమ ప్రత్యర్థి వైఎస్ జగన్ పట్టుబడితే సాధించే వరకు నిద్రపోరు అనే సంగతిని ఆమె గుర్తు చేసుకుంటున్నారు..అందుకే ఇప్పుడు కుప్పం టిడిపి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు..


అధికార ప్రతిపక్ష పార్టీలు చేరో రూ.100 కోట్లు ఓటర్లకు,  రూ.50 కోట్లు చొప్పున చిన్న,  పెద్ద పార్టీ నాయకులకు ఇచ్చి ఎన్నికల్లో బాగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఇకపోతే సొంత నియోజకవర్గమైన కుప్పమే ఏమవుతుందో అనే భయాన్ని చంద్రబాబులో కలిగించడంలో జగన్ ఇక్కడ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.. అయితే ఇక్కడ ప్రజలు కూడా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది... ఎవరు అధికారంలోకి వస్తే తమ ప్రాంతం,  తమ ప్రజలు అభివృద్ధి చెందుతారో వారికే ఓటు వేయాలి.. కానీ డబ్బుకు కక్కుర్తి పడి చాలామంది.. ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వారికి ఓటు వేస్తున్నారు. ఆ డబ్బు అప్పటికప్పుడే పనికొస్తుందని మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఇక ప్రధాన పార్టీ,ప్రతిపక్ష పార్టీలలో ఎవరు తమకు మేలు చేస్తారు అని నమ్మితేనే.. వారికే ఓటు వేయాలి.. డబ్బుకు కక్కుర్తి పై ఓటు వేస్తే మాత్రం నిజంగా బలయ్యేది తామే అని గుర్తించలేకపోవడం ఇక్కడ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సో ఓటర్స్ బీ కేర్ ఫుల్..

మరింత సమాచారం తెలుసుకోండి: