అంద‌రి దృష్టి ఏపీలో జ‌రుగుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల మీదే ఉంది. కానీ ఇటు తెలంగాణ‌లో పార్ల‌మెంటు ఎన్నిక‌లు కూడా జ‌రుగుతున్నాయి. తెలంగాణ‌లో పార్ల‌మెంటు ఎన్నిక‌ల నేప‌థ్యంలో అక్క‌డ ఓట‌రు మూడ్ ఎలా ఉందో ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణ లో కాంగ్రెస్ కు తక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్లు కాదు.. (అసెంబ్లీ ఎన్నికలు వేరు.. లోక్సభ ఎన్నికలు వేరు) అంటున్నారు. అదంతా మోదీ మేనియా పనిచేసినట్లు లెక్కగానే చూడాలి. ఎందుకంటే 2018 లో తెలంగాణ‌లో జ‌రిగిన ముంద‌స్తు సాధార‌ణ ఎన్నిక‌ల్లో అధికార బీఆర్ఎస్ వార్ వ‌న్‌సైడ్ చేసేసి ఏకంగా 88 సీట్లు గెలుచుకుంది. ఆ త‌ర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది బీఆర్ ఎస్ పార్టీలో చేరిపోయారు.


క‌ట్ చేస్తే ఆ వెంట‌నే ఐదు నెల‌ల‌కే జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 3 ఎంపీ సీట్లు.. బీజేపీ ఏకంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకుని బీఆర్ ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చాయి. ఇక ఇప్పుడు ఎన్నిక‌ల్లో బీజేపీ కి ఎక్కువ సీట్లు వ‌స్తే అది మోదీ మానియా అవుతుంది. అదే బీఆర్ఎస్ కు 4-5 సీట్లు వస్తే మాత్రం రేవంత్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లే అని భావించాలి. వాస్త‌వానికి మొన్నటి అసెంబ్లీ లెక్కల ప్రకారమే అయితే..
కాంగ్రెస్ 8-9
బీఆర్ఎస్ 5-6
బీజేపీ 1-2
ఎంఐఎం 1 ఒక సీటు రావాల్సి ఉంటుంది.


అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతున్న వాతావ‌ర‌ణ‌మే ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కావాల‌ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన‌మైన క్యాండెట్ల‌ను నిల‌బెట్టి ప‌రోక్షంగా బీజేపీకి ల‌బ్ధి క‌లిగేలా చేసిందా ? అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. అందుకే బీజేపీ అంచ‌నాల‌కు మించి మ‌రీ పుంజుకుంటోంది.


ప్రస్తుత అంచనాలు తెలంగాణ లోక్సభ ఫలితాలు..
బీజేపీ:
1) కరీంనగర్
2) ఆదిలాబాద్
3) నిజామాబాద్
4) వరంగల్
5) భువనగిరి
6) మల్కాజిగిరి
7) సికింద్రాబాద్
8) చేవెళ్ల
9) మహబూబ్ నగర్
10) జహీరాబాద్


కాంగ్రెస్:
1) పెద్దపల్లి
2) మహబూబాబాద్
3) ఖమ్మం
4) నల్లగొండ
5) నాగర్ కర్నూల్


బీఆర్ఎస్:
1) మెదక్


ఎంఐఎం:
1) హైదరాబాద్

మరింత సమాచారం తెలుసుకోండి: