ప్రస్తుత రాజకీయాల్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ అవుతాయా అనే ప్రశ్నకు నిర్మొహమాటంగా సాధ్యం కాదనే జవాబు వినిపిస్తుంది. అయితే కడప కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల మాత్రం ఓటుకు నోటు ఇవ్వడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. తనను అభిమానించే వాళ్లు ఓటు వేస్తారని వాళ్లే తనను గెలిపిస్తారని ఆమె భావిస్తున్నట్టు భోగట్టా. రాజన్న బిడ్డ కాబట్టి తనకు ఓటు వేయాలని ఆమె ఫీలవుతున్నారని సమాచారం.
 
ఇతర పార్టీల నుంచి మాత్రం కడప కోక్ సభ నియోజకవర్గానికి చెందిన ఓటర్లకు భారీ మొత్తంలోనే డబ్బు అందుతోందని తెలుస్తోంది. వైసీపీ, టీడీపీ ఎన్నికల్లో గెలుపు కోసం భారీగానే ఖర్చు చేస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఎన్నికలకు మరో 3 రోజుల సమయం ఉండటంతో షర్మిల ఎంతో కొంత మొత్తం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోటు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని చాలా నియోజకవర్గాల్లో ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.
 
ఏపీ సీఎం వైఎస్ జగన్ తన చెల్లి షర్మిలకు డిపాజిట్లు కూడా దక్కవని బాధగా ఉందని వెల్లడించగా జగన్ మాటలే నిజమయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రూపాయి కూడా ఇచ్చేదేలే అంటూ షర్మిల చేస్తున్న రాజకీయాలు మాత్రం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలే షర్మిల భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయి.
 
కడప ఎంపీగా షర్మిల ఓడిపోయినా ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవి దక్కుతుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. షర్మిల ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి వినిపిస్తోంది. షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం మినహా సాధించేది మాత్రం ఏమీ ఉండదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోతే కూడా తాను ఓటర్లకు డబ్బులు పంచలేదు కాబట్టే ఓడిపోయానని షర్మిల చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: