తమిళ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమాల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న కొంత మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. అందులో భాగంగా ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఠాగూర్ సినిమాలో చిరంజీవి కి జోడిగా నటించింది.

మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈమెకు నటిగా సూపర్ క్రేజ్ లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్ కింగ్ అక్కినేని హీరో నాగార్జున హీరో గా రూపొందిన మాస్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమాతో ఈమె క్రేజ్ మరింత గా తెలుగు లో పెరిగింది. ఈ రెండు సినిమాల విజయాల తర్వాత ఈమెకు తెలు గులో వరుస అవకాశాలు దక్కాయి. దానితో ఈమె ఇటు తెలుగు , ఇటు తమిళ ఇండస్ట్రీ లలో అద్భుతమైన జోష్ ఉన్న నటిగా కెరీర్ ను కొనసాగించింది. అలాంటి సమయం లోనే ఈమె నటుడు సూర్య ను ప్రేమించి వివాహం చేసుకుంది.

ఇక వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈమె సంసార జీవితాన్ని ఎంతో సంతోషంగా ముందుకు సాగిస్తూనే వీలు చెప్పినప్పుడల్లా సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఈమె హిందీ లో తనకు అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను వివరించింది. నేను హిందీ అమ్మాయిని అయినప్పటికీ నన్ను అంతా సౌత్ అమ్మాయి అనుకునేవారు. ఆ కారణం తోనే నాకు హిందీ సినిమాలు రాలేదు అని నేను భావిస్తున్నాను అని ఈమె తాజా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: