- క‌ళ్లు జిగేల్‌మ‌నే లెక్క‌లు ఇవి
- గోదావ‌రి జిల్లాల్లో పంప‌కాలు ప్రారంభం
- 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో కోట్ల‌లో పంప‌కాలు

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు రోజుల టైం మాత్ర‌మే ఉంది. మ‌రో 24 గంట‌ల్లో ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌చారం ఆగిపోతుంది. మైక్‌లు బంద్ అవుతాయి. అభ్య‌ర్థులు ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌చారాన్ని హెరెత్తిస్తున్నారు. ఇక ప్ర‌చారం ముగుస్తోంద‌న‌గానే డ‌బ్బు పంప‌కాలు కూడా షురూ అయిపోతాయి. గ‌త ఎన్నిక‌ల్లోనే స‌గ‌టున చాలా వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటు రేటు రు. 2 వేల వ‌ర‌కు ప‌లికింది. కొన్ని టాప్ నియోజ‌క‌వ‌ర్గాల్లో రు. 3 వేల వ‌ర‌కు కూడా ఇచ్చారు.


కొంద‌రు ఫ‌స్ట్ రౌండ్ రు. వెయ్యి పంచి మ‌రో రౌండ్‌లో రు. 500 లేదా వెయ్యి పంచారు. కొంద‌రు మంత్రులు, బాగా డ‌బ్బున్న వాళ్లు అయితే ఫ‌స్ట్ రౌండ్‌లో రు. 2 వేలు పంచి.. రెండో రౌండ్‌లో రు. వెయ్యి వ‌ర‌కు ఓటుకు పంచారు. ఈ సారి ఎన్నిక‌ల‌కు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో డ‌బ్బుల పంపిణీ స్టార్ట్ అయిపోయింది. మ‌రీ ముఖ్యంగా ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ డ‌బ్బు పంపిణీ లు మొద‌లు పెట్టేశారు.


అయితే అధికార వైసీపీ ఈ డ‌బ్బు పంపిణీలో ముందు వ‌రుస‌లో ఉంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని చింత‌ల‌పూడి, కొవ్వూరు, గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ వాళ్లు డ‌బ్బులు పంచేస్తున్నారు. చింత‌ల‌పూడిలో ఓటుకు రేటు వెయ్యి ప‌లుకుతోంది. టీడీపీ వాళ్లు పంచాక‌.. అవ‌స‌రం అయితే రెండో రౌండ్‌లో పంచాల‌న్న‌దే వీళ్ల ప్లాన్ గా తెలుస్తోంది. ఇక గోపాల‌పురంలో హోం మంత్రి తానేటి వ‌నిత వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆమె ఓటు రేటు రు. 1500 గా ఫిక్స్ చేసిన‌ట్టు లోక‌ల్ వైసీపీ వాళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.


ఇక కొవ్వూరులో వైసీపీ అభ్య‌ర్థిగా ఉన్న ప్ర‌స్తుత గోపాల‌పురం ఎమ్మెల్యే త‌లారి వెంక‌ట్రావు ఓటు రేటు రు. 2 వేల వ‌ర‌కు ఫిక్స్ చేసి పంపిణీ ప్ర‌క్రియ మొద‌లు పెట్టించిన‌ట్టు టాక్ ? ఇక ఈ రోజో లేదా రేపో టీడీపీ వాళ్లు కూడా ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీ మొద‌లు పెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: