సార్వత్రిక ఎన్నికలలో ప్రచారంలో భాగంగా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి.. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు తమ సహనాన్ని కోల్పోయి కొన్నిసార్లు తమ నోటికి పని చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా బిజెపి నేత అమరావతి ఎంపీ నటి నవనీత్ కౌర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది. హైదరాబాద్ లో మే 8వ తేదీన బిజెపి అభ్యర్థి డాక్టర్ మాధవిలతకు నవనీత్ కౌర్ మద్దతుగా ప్రచారం చేస్తోంది. ఈ సందర్భంగా 2012లో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను సైతం ప్రసారం చేస్తూ తనపై చేసిన ఈ వ్యాఖ్యలను సైతం అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు.


15 సెకండ్లు ఎందుకు గంట సమయం తీసుకు ముస్లింలను ఏం చేస్తారో చేయండి మీ దగ్గర అధికారం ఉంది కదా అని భయపడేది లేదు.. ఎవరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము దమ్ముంటే చేసి చూపించాలంటూ అసదుద్దీన్ ఓవైసీ ఒక సవాల్ ను సైతం విసిరారు.. దాదాపు 12 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు .. పోలీసులకు 15 నిమిషాలు పక్కన తప్పుకుంటే లెక్కలు సరి చేస్తామంటూ కూడా అక్బరుద్దీన్ వెల్లడించారు.. కానీ వాళ్లకు 15 నిమిషాలేమో మాకు 15 సెకండ్లు చాలు అంటూ నవనీత్ కౌర్ గెట్టి కౌంటర్ ఇచ్చింది.


ఈ వాక్యాల పైన ఓవైసీ ఇలా స్పందిస్తూ మోడీజికి చెబుతున్న ఆమెకు 15 సెకండ్లు కాదు గంట సమయం ఇస్తున్న ఏం చేస్తారో చేయండి.. మీలో మానవత్వం మిగిలి ఉందా లేదా అనేది మేము కూడా చూడాలనుకుంటున్నాము అంటూ వెల్లడించారు.. ప్రధాన పదవి కూడా మీదే ఆర్ఎస్ఎస్ అంతా మీదే అధికారం మీది అయినప్పుడు ఎవరు ఆపుతారు అంటూ ఓవైసీ ఒక ఛాలెంజ్ ను సైతం విసిరారు.. మాధవి లత హైదరాబాద్ మరో పాకిస్తాన్ కాకూడదు అంటూ అడ్డుకుంటున్నారని ఎవరైనా కాంగ్రెస్ లేదా ఎంఐఎం కి ఓటేస్తే పాకిస్తాన్ కి మద్దతు వేసినట్లే అంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: