* పంపిణి ప్రారంభించిన పల్నాడు
* ప్రత్యర్థి ఇచ్చేదానిపై రూ.500 పెంపు
* తగ్గేదిలేదంటున్నా అధికార పార్టీ


పల్నాడు - ఇండియా హెరాల్డ్ : నరసరావుపేట పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానంపై వైసిపి, ఎన్‌డిఎ కూటమి, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ముమ్మర ప్రచారం చేపట్టారు. పోలింగ్‌కు రెండ్రోజులే మిగిలి ఉంది. శనివారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగుస్తుంది. ఈ లోగా ప్రచారాన్ని మరింత ఉధృతంగా చేయాలని ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేశాయి.
 ప్రధాన పార్టీలు వారి దృష్టి మొత్తం ప్రస్తుతం డబ్బు పంపిణీపై పెట్టాయి. అయితే ఇప్పటికే కొన్నిచోట్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఒక్క ఓటు కనీసం 3000 నుంచి 4000 పలుకుతుంది.వైసీపీ నేతలు ఎన్నికలకు ముందే తొలి విడత నగదు పంపిణీ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూట మికి, వైసీపీకి నడుమ పోటాపోటీగా ఉన్న స్థానాల్లో తొలి విడతగా ఒక్కో ఓటరుకు 2000 నుంచి 3000 పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెండో విడత నగదు ఎంత మొత్తం ఇవ్వాలనేది నిర్ణయించాలని ప్రధాన పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈసారి ఓటు రేటు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే ఈ పంపిణిలో భాగంగా పల్నాడు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో భారీగా డబ్బులు పంచే ప్రక్రియ ప్రారంభం యింది. టీడీపీ మాత్రం ఇంకా ఆ ప్రక్రియ స్టార్ట్ చేయలేదు. ఉద్యోగులలో స్పష్టంగా కనిపించిన వ్యతిరేకత, తటస్థ ఓటర్లలో టీడీపీ అనుకూల వాతావరణం బహిర్గతం కావడంతో వైసీపీ నాయకులు ఓట్ల కొనుగోలుకి భారీ రేటు పెట్టారని ప్రచారం జరుగుతోంది.ప్రత్యర్థి ఇచ్చే దాన్ని బట్టి ఇంకో 500 నుండి 1000 కలిపి ఇచ్చే పనిలో టీడీపీ ఉందని తెలుస్తుంది.ఈ ఏడు నియోజకవర్గాల్లో 1500-2000 కోట్లు ఖర్చు అవుతాయని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.


ఓటర్లు దూర ప్రాంతంలో ఉంటే వారికి ప్రయాణ ఖర్చులు భరించేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారట. ఏపీలో అధికారపార్టీకి చెందిన అభ్యర్థులు హైదరాబాద్‌లో ఉన్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బస్సులోనే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసి, తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరో పార్టీ అభ్యర్థులు పొరుగూరు నుంచి వచ్చేవారికి బస్సు ఛార్జీలు చెల్లించడంతో పాటు.. హైదరాబాద్ నుంచి వచ్చే స్వగ్రామాలకు వచ్చే ఓటర్లకు రూ.1000 నుంచి రూ.1500 చొప్పున ప్రయాణ ఖర్చులు భరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణం చేసిన టికెట్ చూపించి స్థానిక నాయకుల దగ్గర డబ్బులు తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.ఈ రకంగా చూసుకుంటే మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కలుపుకుంటే ఇంకో అయిదు కోట్లు ఖర్చు కూడా కనబడుతుందని లెక్కలు చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: