తెలుగు , తమిళ పరిశ్రమలలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన నయన తార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఈ మధ్య కాలంలో ఎక్కువ తెలుగు సినిమాలు చేయడం లేదు. కానీ తమిళ్ లో మాత్రం వరస సినిమాలలో నటిస్తూ ఇప్పటికి కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గానే కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఎన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీ లలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన ఈ బ్యూటీ కొంత కాలం క్రితమే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టడం ఇందులో నయనతార తన నటనతో , అందాలతో ప్రేక్షకులను అలరించడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దానితో ప్రస్తుతం ఈమెకు వరుస హిందీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తూ ఉండే ఈ నటి ఇంతకాలం పాటు సోషల్ మీడియాలో మాత్రం పెద్దగా అందాలను ఆరబోయలేదు.

 


కానీ ఈ మధ్య కాలంలో ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈమె అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని తన కురులను ముందుకు వేసుకొని స్టైలిష్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: