తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ధనుష్  ప్రస్తుతం "రయాన్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఈయనే రచన మరియు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. 

కాకపోతే ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ఈ మూవీ మేకర్స్ ప్రకటించలేదు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని జూన్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అయింది. ఇకపోతే ఈ మూవీ యూనిట్ వారు నిన్న ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన సినిమా కావడంతో ఈ మూవీ యొక్క ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ మూవీ మొదటి పాట కూడా ఉండడంతో ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు స్థిరంగానే ఉన్నాయి.

మరి ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది కాబట్టి ఈ మూవీ కి సంబంధించిన ప్రచార చిత్రాలు వరుసగా విడుదల అయ్యే అవకాశం ఉంది. అవి కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో ఆకట్టుకున్నట్లు అయితే ఈ మూవీ పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం ధనుష్ , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: