ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది.అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతం ఇంటర్వ్యూలు వివిధ ఛానెల్స్ కు ఇచ్చారు.తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎల్లో మీడియా, వైసీపీకి అనుకూలంగా బ్లూ మీడియా  సపోర్ట్ గా ఉన్న సంగతి తెల్సిందే.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ వార్త సంస్థ అయిన టీవీ-9కి సీఎం జగన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అదే సమయంలో తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా అయిన ఏబీఎన్‌ల ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఇంటర్వ్యూ చేశారు.బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు  వేరువేరు ఛానెళ్లలో ప్రసారమైన రెండు ఇంటర్వ్యూలు రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఎఫెక్ట్ చేయనున్నాయి.అయితే ఈ రెండు ఇంటర్వ్యూల్లో ఎక్కువమంది జనాలు జగన్‌ ఇంటర్వ్యూ చూసేందుకే ఇష్టపడ్డారు. టీవీ-9లో జగన్‌ ఇంటర్వ్యూను లైవ్‌లో అత్యధికంగా 72 వేల మంది చూశారు. ఇదే సమయంలో ABNలో ప్రసారం అయిన చంద్రబాబు ఇంటర్వ్యూను అత్యధికంగా చూసింది ఎంత మందంటే.. కేవలం 20 వేల మంది. ఇక సోషల్ మీడియాలోనూ జగన్‌ ఇంటర్య్వూకు సంబంధించిన అనేక వీడియో క్లిప్స్‌ వైరల్‌గా మారాయి. కానీ, చంద్రబాబు ఇంటర్వ్యూ ప్రసారమైనట్లు సోషల్‌మీడియాలో పెద్దగా చర్చ కూడా జరగలేదు.

జగన్ తన ఇంటర్వ్యూలో భాగంగా భూ సర్వే గురించి ముఖ్యంగా ల్యాండ్‌ టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు సంధించిన ప్రశ్నలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. అసలు తన విజన్ మరియు తన పాలనా విధానం ఏమిటి అనేదాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు.ఒకవైపు చంద్రబాబు ఇంటర్వ్యూ చూసే వాళ్లు కరువైయ్యారు అనే విధంగా ఉంది.చంద్రబాబు ప్రసంగాలు ఎంత బోర్‌ కొట్టిస్తాయో, ఆయన ఇంటర్వ్యూ కూడా అట్లాగే విసుగు పుట్టిస్తుంటుంది. అందుకే చంద్రబాబు మాట్లాడితే ఎవరూ పట్టించుకోరు.ఇక చంద్రబాబు దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. తాను పేదలకు ఏం చేశానో చెప్పుకోలేకపోతున్నారు. సంక్షేమం విషయంలో తన మార్క్‌ను చూపించడంలో అట్టర్‌ ఫ్లాప్ అయ్యారు చంద్రబాబు. ఇప్పటికీ జగన్ పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టోగా ప్రచారం చేసుకుంటున్నారు బాబు.ఈ ఇంటర్వ్యూలను ఉదాహరణగా తీసుకుంటే ప్రజల్లో విశ్వసనీయత, నిజాయితీ కలిగిన నాయకులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని వైసీపీ నేతలు ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇదే సీఎం  జగన్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్. వైయస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసేలా చేసిన ఈ ఇంటర్వ్యూ మరలా సీఎం పీఠం ఎక్కించబోతుందనే చెప్పకనే చెప్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: