- ప‌రిశ్ర‌మ‌లు.. ఉపాధి క‌ల్ప‌న‌లో చంద్ర‌బాబు, జ‌గ‌న్ దొందూదొందే
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై నోరు మెద‌ప‌ని బాబు

( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )

దేశంలో అయినా.. రాష్ట్రంలో అయినా.. పారిశ్రామిక రంగం వృద్ధి చెందాలి. గ‌తంలో నెహ్రూ నుంచి మ‌న్మోహ‌న్‌సింగ్ హ‌యాం 2014 వ‌ర‌కు.. కూడా పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లు అని అమ‌లు చేసేవారు. వీట‌లో ప్ర‌ధానంగా పారాశ్రామిక రంగానికి ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు ఉండేవి. మోడీ హ‌యాం వ‌చ్చిన త‌ర్వాత‌.. పంచ వ‌ర్ష ప్ర‌క‌ణాళిక‌ల‌ను ఎత్తేసి.. దాని స్థానం నీతి ఆయోగ్ తీసుకువ‌చ్చారు. ఇది పారిశ్ర‌మ‌ల‌కు చిన్న పీట వేసి.. సృజ‌నాత్మ‌క‌త‌కు పెద్ద‌పీట వేసింది. దీంతో దేశంలో పారిశ్రామిక రంగం కుదేలైంది.


ఇదే ప‌రిస్థితి ఏపీలోనూ క‌నిపించింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటీక‌రించే ప‌రిస్థితి ఎక్కువ‌గా ఉంది. 99 శాతం కేంద్రం త‌న పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించుకున్న ప‌రిశ్ర‌మ‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడు విశాఖ‌ప‌ట్నం స్టీల్ ప్లాంటు ఈ కోవ‌లేదే. దీనిని ప్రైవేటీక‌రించ‌డం వెనుక కార‌ణం కూడా.. ఇదే. పారిశ్రామికంగా.. ఉండే చ‌ట్టాలు.. లేబ‌ర్ చ‌ట్టాలు.. వంటివి ప్ర‌భుత్వాల‌కు ఇబ్బందిగా ఉన్నాయ‌నేది వారి మాట‌. వాస్త‌వానికి దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత 65 ఏళ్ల‌పాటు నిర్విఘ్నంగా సాగిన ప‌రిశ్ర‌మ‌ల‌కు ఇప్పుడే న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు.


స‌రే.. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అయినా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మైనా.. కేంద్రం బాట‌లోనే న‌డిచాయి. ప‌రిశ్ర‌మ‌ల‌కు పెద్ద‌పీట వేయ‌లేక పోయారు. ఫ‌లితంగా చ‌క్కెర కర్మాగారాలు నేటికీ మూత‌ద‌శ‌లోనే ఉన్నాయి. స్పిన్నింగ్ మిల్లుల్లోనూ ప్ర‌భుత్వం త‌న పెట్టుబ‌డులు తీసేసుకుని ప్రైవేటు ప‌రం చేసింది. దీంతో దుస్తుల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా పారిశ్రామిక రంగం అటు చంద్ర‌బాబు హ‌యాంలోనూ.. ఇటు జ‌గ‌న్ హ‌యాంలోనూ పుంజుకున్న‌ది అయితే లేదు.


దీనిపై ఎవ‌రికీ దృష్టి కూడా లేదు. ఇక‌, మిగిలింది.. ఒక్క విశాఖ ప‌ట్నం స్టీలు ప్లాంటు. దీనిని కేంద్రంప్రైవేటు ప‌రం చేస్తాన‌ని చెబుతోంది. దీనిని ఆపేందుకు మాత్రం జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొంత వ‌ర‌కు ప్ర‌య‌త్నించిన మాట వాస్త‌వం. చంద్ర‌బాబు విష‌యంలో అది కూడా లేదు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తున్నారే త‌ప్ప‌.. చంద్ర‌బాబు ఎక్క‌డా ఈ మాట ఎత్త‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మ‌రో కీల‌క అంశం.. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ.

మరింత సమాచారం తెలుసుకోండి: