క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా తనదైన కష్టంతో స్టార్ హీరోలు అందరికీ దీటుగా విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ఇతడు తాజాగా లైగర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను పలకరించాడు. ఇకపోతే విజయ్ దేవరకొండ నువ్విలా,  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలలో చిన్న పాత్రల్లో కూడా నటించాడు. ఇకపోతే నటుడు గానే కాకుండా సహాయ దర్శకుడిగా కూడా అరంగేట్రం చేశారు.. నిజానికి విజయ్ దేవరకొండ అంటే అమ్మాయిలలో విపరీతమైన క్రేజ్ ఉంది. కేవలం అమ్మాయిల లోనే కాదు సౌత్ , నార్త్ సినీ ఇండస్ట్రీలో కూడా ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అమ్మాయిలు తమ వీపుపై కూడా విజయ్ దేవరకొండ ఫోటోను టాటూగా వేయించుకున్నారు అంటే , ఇక ఈయన అంటే ఎంత అభిమానమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేయాలి అంటూ ఎంతో మంది హీరోయిన్లు కూడా ఇంటర్వ్యూల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి,  గీతాగోవిందం లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈయన సినిమాలతోనే కాదు ఎఫైర్స్ తో కూడా ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు ఇప్పటివరకు విజయ్ దేవరకొండ తో రిలేషన్ లో మునిగి తేలిన ఆ హీరోయిన్ లు ఎవరో మనం చదివి తెలుసుకుందాం. గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ రష్మిక ల  మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.  ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటించారు.  ఇప్పటికీ కూడా వీరిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే కాదు ప్రతిరోజూ సమయం దొరికితే పబ్బులు, పార్టీలు అంటూ తిరుగుతూ మీడియా కంట పడుతూ ఉంటారు.ఇక ఈ క్రమంలోని వీరి మధ్య ఎఫైర్ ఉందనే విషయం కూడా వైరలవుతూ ఉండడం గమనార్హం. ఇక రశ్మిక నే కాదు ఒక ఫారినర్ తో కూడా కొన్నాళ్లపాటు డేటింగ్ చేశాడు విజయ్ ఆ వార్తలను కొట్టి పారేయలేదు కానీ అలా అని నిజం అని కూడా చెప్పలేదు. ఇదే కాదు విరాట్ కోహ్లీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇసబెల్లాతో కూడా విజయ్ దేవరకొండ డేటింగ్ చేశాడని వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: