పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక పవన్ నటించిన సినిమా విడుదలైతే తొలిరోజు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ కావాల్సిందేననే సంగతి తెలిసిందే.ఇకపోతే కొన్నిరోజుల క్రితం వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల కోసం తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్నారు.ఇక  కాలేజ్ కుర్రాడిలా పవన్ కళ్యాణ్ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్, కీరవాణి కలిసి ఫోటో దిగగా మీ పక్కన ఉన్న కుర్రాడు ఎవరు సార్ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేయడం గమనార్హం.

 కాగా మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతోంది.ఇక  పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. కాగా ఏఎం రత్నం నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.అయితే అక్టోబర్ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.ఇకపోతే  లుక్ మార్చుకున్న పవన్ కళ్యాణ్ తన కొత్త లుక్ తో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.అంతేకాదు నవ రాత్రులలో నవ ఉత్తేజం అంటూ కీరవాణి పవన్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.

అయితే ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా నుంచి విడుదలైన పవర్ గ్లాన్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.కాగా  హరిహర వీరమల్లు సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వినోదాయ సిత్తం రీమేక్, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలలో ఏ సినిమా మొదట రిలీజవుతుందో చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: