టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ కాంబోలో రావాల్సిన ప్రాజెక్ట్ రోజు రోజుకూ వాయిదా పడుతూనే వస్తోంది. ఆచార్య సినిమా ఫలితాన్ని మెగా హీరోలు కొరటాల శివ మీద తొయ్యడం వల్ల అతని టేకింగ్ మీద అందరికీ అనుమానం కలిగింది.అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కొత్త కథ మీద స్ట్రాంగ్ గా కూర్చున్నాడట. పాన్ ఇండియాకు సరిపడా కథను సెట్ చేయాలని కొరటాల ఇంకా ఎన్టీఆర్ బాగానే కష్టపడ్డారు. అందుకే ఈ సినిమా బాగా ఆలస్యం అవుతూ వచ్చింది.ఎట్టకేలకు ఈ సినిమాను ఈ వారం ప్రారంభించబోతోన్నామని మూవీ యూనిట్ సంబర పడింది. అయితే ఇంతలో తారకరత్న గారి మరణ వార్త నందమూరి వంశాన్ని ఇంకా అభిమానులను ఎంతగానో కుదిపేసింది. అందుకే ఈ సినిమాను ఇప్పుడు ప్రారంభించడం సరైంది కాదని భావించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. 


అందుకే ఈ సినిమాను వీలు చూసుకుని తరువాత ఎప్పుడైనా ప్రారంభిద్దామని దర్శకునితో అన్నాడట. అందుకే ఈ మూవీ ప్రారంభోత్సవాన్ని కూడా వాయిదా వేశారట.ఇలా సినిమా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయడం సరైన నిర్ణయమని నందమూరి అభిమానులు కూడా అంటున్నారు. ఈ సినిమా ఆలస్యం అవుతోందనే బాధ ఉంది కానీ.. ఇలాంటి సమయంలో సినిమా ప్రారంభోత్సవాన్ని జరపకపోవడమే మంచిదని అభిమానులు చెబుతున్నారు.నందమూరి ఫ్యామిలీకి ఇప్పుడు వచ్చిన కష్టం చూసి ఫ్యాన్స్ అంతా కూడా కన్నీరుమున్నీరవుతున్నారు. నందమూరి ఇంట ఇలా వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తారకరత్న మొత్తం 23 రోజులుగా హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతూనే వచ్చాడు. చివరకు ఆయన నింగికెగిశాడు. ఇక లోకేష్ పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను మొదటగా కుప్పంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు ఆ తరువాత బెంగళూరు హాస్పిటల్‌కు తరలించిన విషయం తెలిసిందే.23 రోజుల పాటు కోమాలోనే ఉన్నారు తారకరత్న. తారక రత్న మరణంతో అటు సిని అభిమానులు ఇంకా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: