ప్రపంచ వ్యాప్తంగా ప్రతివ్యక్తి జీవితం డబ్బు చుట్టూ తిరిగే పరిస్థితులలో ఆ డబ్బుతో మనకు ఏర్పడే రిలేషన్ షిప్ ను రెండు కారణాలు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. ప్రతివ్యక్తి తన వద్ద ఉండే డబ్బుతో ప్రేమ బంధం కాని లేదంటే భయంతో కూడిన బంధాన్ని కాని ఏర్పరుచుకుంటాడు.


ఒకసారి తన వద్ద ఉన్న డబ్బు అంతా పోగొట్టుకుంటే తాను ఏమైపోతాను అన్న భయాలు ప్రతివ్యక్తికి వారివారి స్థాయిలలో ఉంటాయి. ఈ భయాల మోతాదును బట్టి ఒక వ్యక్తి ప్రవర్తన ఉంటుంది. డబ్బు పట్ల ప్రేమను పెంచుకోవడం మంచిదే అయినప్పటికీ ఆ ప్రేమ మితిమీరిన ప్రేమగా మారితే భయాలు ఏర్పడతాయి అని మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం. ముఖ్యంగా మనీ ని పెట్టుబడిగా మార్చే విషయంలో ఈ భయాలు గొప్పవారి దగ్గర నుండి సామాన్యుడి వరకు ఏర్పడుతూనే ఉంటాయి.


అయితే ఈ భయాలు మన ఆలోచనల ప్రభావితం చేయడం మొదలుపెడితే ఒకవ్యక్తి ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. దీనితో డబ్బు పట్ల మనకు ఉండే రిలేషన్ షిప్ ను మానవ సంబంధాల కంటే చాల తెలివిగా మ్యానేజ్ చేయాలి అని మనీ ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. ముఖ్యంగా డబ్బును ఖర్చుపెట్టే విషయంలో ఏవ్యక్తి అయినా చాల చాకచక్యంగా తన తెలివితేటలు వినియోగించకపోతే ఈడబ్బు ప్రతి వ్యక్తికి ఎన్నోభయాలను క్రియేట్ చేస్తుంది.


అయితే ప్రతి విషయం ఏదీ జరగదు అన్న ఆలోచనల నుండి ప్రతివిషయం జరుగుతుంది అన్న పాజిటివ్ ఆలోచనలు లేకపోతే మన డబ్బుతో మనకు ఉన్న బంధాలు అనేక సమస్యలను తెచ్చి పెడతాయి. దీనితో మన దగ్గర ఉన్న ‘హ్యాపీ మనీ’ ‘అన్ హ్యాపీ మనీ’ గా మారిపోతుంది. అందువల్లనే కొందరు మనీ ఎక్స్ పర్ట్స్ మన పర్స్ లో ఉండే డబ్బు ఎప్పుడు జోష్ తో నవ్వుతు ఉండే పాజిటివ్ వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే ఏవ్యక్తి అయినా సంపన్నుడు కాగలుగుతాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: