మీరు మీ బిడ్డ పుట్టిన రోజు నుంచే ప్రతి నెల రూ.5000 రూపాయలను కేటాయించగలిగితే ఖచ్చితంగా 20 సంవత్సరాల లో ఆమె కోసం రూ.50 లక్షల నిధిని మీరు సులభంగా దాచి పెట్టవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈరోజుల్లో సాధారణ ప్రజల్లో కూడా ఈ పథకం బాగా పాపులారిటీ దక్కించుకుంది మార్కెట్తో ముడిపడి ఉండడం వల్ల ఫిక్స్డ్ వడ్డీ రేట్లు హామీ ఇవ్వలేవని గమనించాలి. అయితే నేరుగా మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టడం కంటే ఇందులో తక్కువ ఇస్తూ ఉంటుంది.
ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల 12 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ప్రతి నెల రూ.5000 పెట్టుబడితో 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే 20 సంవత్సరాలు లో మీ మొత్తం పెట్టుబడి రూ.12,00,000.. అయితే 12 శాతం వడ్డీ లభిస్తుంది కాబట్టి పెట్టుబడి మొత్తం పై మీరు రూ.37,95,740 వరకు వడ్డీ పొందవచ్చు. ఇలా చేస్తే 20 సంవత్సరాల లో పెట్టుబడి మొత్తం వడ్డీతో కలిపి రూ.49,95,740 మీ చేతికి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పథకాలు పిల్లల భవిష్యత్తుకు పూర్తి భద్రతను అందిస్తాయని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి