"వాల్టర్ వెట్రివేల్ " అనే తమిళ చిత్రానికి రీమేక్ గా "ఎస్. పి.పరశురాం" చిత్రాన్ని తెరకేక్కించారు. అయితే తెలుగు లో కంటే ముందే ఈ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేశారు . ఇక అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం తో తెలుగులో చిరంజీవి చేత రీమేక్ చేయించారు. అయితే తమిళం మరియు హిందీ లో బాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ చిత్రం,తెలుగులో కూడా అంతే స్థాయిలో హిట్ కొడుతుంది అనుకున్నారు అందరూ కానీ, అందరి అంచనాలను ఒక్కసారిగా మార్చేసింది.మొదటి రోజే ఫ్లాప్ టాక్ ను అందుకుంది.ఈ సినిమా ఫ్లాప్ అవడానికి గల కారణం ప్రధానంగా హీరో తమ్ముడు బ్లూ ఫిలిమ్స్ తీసే వ్యక్తిగా కనిపించడం, అలాగే హీరోయిన్ శ్రీదేవి కంటి చూపు లేని ఇల్లాలిగా కనిపించడం వంటివి ఈ చిత్రానికి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.