ప్రపంచ వ్యాప్తంగా ఆ మద్య ‘కొలవరి డీ’ సాంగ్ ఎంత ప్రభంజనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటపై ఎన్నో పేరడీ సాంగ్స్ వచ్చాయో..ఎన్ని ఫన్నీ వీడియోలు వచ్చాయో చెప్పలేం. అలాంటి పాట సృష్టికర్త ఓ చిన్న కుర్రాడు..అతడే సంగీత దర్శకుడు అనిరుద్. తమిళనాడు సూపర్ స్టార్ అల్లుడు ధనుష్ నటించిన ‘3’ చిత్రంలోని ఈ పాట స్వయంగా తనే పాడారు. ఈ పాట కంపోజ్, సంగీతం సమకూర్చింది అనురుద్. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుంటుంబానికి బంధువు అయిన ఆయన తొలిచిత్రం 3లోని వై దిస్ కొలవెరి డీ పాటలో అనూహ్యంగా ప్రాచుర్యం పొందారు.
ఆ తరువాత వరుసగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువ సంగీత తరంగంగా రాణిస్తున్నారు. ఆ మధ్య బీప్ సాంగ్ తదితర సంఘటనలతో వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. హీరో శింబు, అనిరుద్ కలిసి పాడిన ఈ పాటపై ఎన్నో విమర్శలు వచ్చాయి..పోలీస్ స్టేషన్, కోర్టు వరకు వెళ్లింది. ఇక తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజిత్ ‘వేదాళం’ చిత్రానికి కూడా మనోడే సంగీతం అందించాడు.
ప్రస్తుతం అజిత్ నటిస్తున్న వివేకం, శివకార్తికేయన్ నటిస్తున్న వేలైక్కారన్ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నారు.అనిరుద్ త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక కాబోయే పెళ్లి కూతురు కూడా అనిరుద్ కి వీరాభిమాని అట. ఆమె తండ్రిది నగల వ్యాపారం అని సమాచారం. ఈ ఏడాదిలోనే అనిరుద్ వివాహం జరగనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.