బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షకీలా (82) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె బంధువు నాసిర్ ఖాన్ ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలియజేశాడు. ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. మా పెద్దమ్మ షకీలా కన్నుమూశారు. 1950, 60ల్లో ఆమె ఓ గొప్ప నటిగా, స్టార్‌గా వెలుగొందారు.
బాబుజీ ధీరే చల్నా, ప్యార్ మే జరా సంభాల్నా అందరికీ గుర్తుండిపోతాయి అన్నారు. రాజ్ కపూర్, షమ్మీ కపూర్, గురుదత్ లాంటి హేమాహేమీలతో కలసి షకీలా నటించారు. ఆలీ బాబా ఔర్ చాలీస్ చోర్, పోస్ట్ బాక్స్ 999, చైనా టైన్, సీఐడీ, ఆర్ పార్ తదితర ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె నటించారు.
ఈ రోజు అంత్యక్రియలు జరపనున్నారనే విషయాన్ని కూడా ఆయన ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించండి అని అన్నారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే పలువరు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు