ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి విభజన సంకేతాలు అందిపోతున్నాయి ఏదైనా ఒక అద్భుతం జరిగితే ఆగి పోతుందేమో కానీ రాష్ట్ర విభజన తధ్యం అని అంటున్నారు. ఇప్పుడీ సెగ మన టాలీవుడ్ కి కూడా తగిలే లా కనిపిస్తోంది. ఈ నెలాఖరుకు రామ్ చరణ్ సినిమా ‘ఎవడు’ వచ్చే నెల మొదటివారంలో పవన్ ‘అత్తారింటికి దారేది’ ఒక దానిపై ఒకటి పోటీగా వస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు రాష్ట్రంలో ఉన్న ధియేటర్ల గురించి కుస్తీలు పట్టిన ఈ చిత్ర నిర్మాతలకు నిన్న రాత్రి నుంచి ఈ రాష్ట్ర విభజన  తగిలింది అంటున్నారు.

ఆగస్టు 5వ తారీఖు నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతూ ఉండటంతో రాష్ట్ర విభజనకు సంబంధించిన కీలక ప్రకటన ఆగస్టు 1 తారీఖు కానీ లేదా 2వ తారీఖు కానీ ప్రకటించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే ఇక మాట్లాడుకోవడాలు లేవు ఇక ప్రకటన మాత్రమే అని మన కాంగ్రెస్ అధినాయకులు అంటూ ఉండటంతో రాష్ట్ర విభజన ప్రకటన తరువాత ఆంధ్రా ప్రాంతం కనీసం కొద్ది రోజులైనా ఉద్యమాలతో హోరెత్తి పోవడం ఖాయం. ఈ ఉధ్యమాలు, బందులు ప్రభావంతో రాష్ట్రము వేడెక్కి పోతుంటే తాము ఎంతో భారీ బడ్జెట్ తో తీసిన సినిమాల వైపు జనం వస్తారా అని ఈ సినిమా నిర్మాతలకు బెంగ పట్టుకుందట. ముఖ్యంగా ఎవడు నిర్మాత దిల్ రాజ్ పరిస్థితి మరీ అగమ్యగోచరంగా ఉంది అంటున్నారు. దీనికి ప్రధానకారణం ఎవడు విడుదలైన రెండు మూడు రోజుల లోపునే కీలక ప్రకటన వస్తుంది అంటున్నారు. ఈ ప్రకటన తో ఒకేసారి కోస్తా జిల్లాలు మండిపోతే దాని ప్రభావం ఈ సినిమా పై తప్పకుండా పడుతుంది. అందువల్ల ఈ సినిమాను భారీ మొత్తాలతో కొనుగోలు చేసిన కోస్తా జిల్లాల బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తమ పరిస్థితి ఏమిటి అంటూ దిల్ రాజ్ పై వత్తిడి చేస్తున్నారట.

 దిల్ రాజ్ కూడా ఈ విష్యం పై చాలా సీరియర్స్ గ ఆలోచిస్తున్నట్లు సమాచారం. పవన్ ‘అత్తారింటికి దారేది’ సంబందించి మటుకు అంత సమస్య లేదంటున్నారు. ఈ సినిమా విడుదల ఆగష్టు మొదటి వారంలో కాబట్టి ఒక వేళ విభజన ప్రకటనతో మన రాష్ట్రంలో అశాంతి పరిస్థుతులు ఏర్పడితే చివరి నిముషంలో ఆ సినిమా రిలీజ్ డేట్ మారిపోతుంది. ఏదిఎమైనా ప్రస్తుత రాజకీయ పరిస్థుతులు చెర్రీ – పవన్ సినిమాలను ప్రమాదపు అంచున నిలబెట్టాయి అనుకోవాలి. ..

 

మరింత సమాచారం తెలుసుకోండి: