
తెలుగు ఇండస్ట్రీలో రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని మాస్ మహరాజ రవితేజ కమెడియన్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అదే ఊపుతో టచ్ చేసి చూడు చిత్రంలో నటించాడు..అప్పటి నుంచి మనోడికి వరుస ఫ్లాపులు ఎదురువుతున్నాయి. దాంతో ఇండస్ట్రీలో మాస్ మహరాజ క్రేజ్ తగ్గిందని..ఇక ట్రెండ్ సెట్ చేయలేడని అందరూ అంటున్నారు. ఇదే సమయంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంథోని ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయ్యింది.

ఈ చిత్రంలో చాలా రోజుల తర్వాత ఇలియానా నటించింది. కానీ ఈ చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో ఆయన అభిమానులు నిరాశతో వున్నారు. రవితేజ కూడా డీలాపడినప్పటికీ, ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వీఐ ఆనంద్ తో కలిసి ఒక చిత్రం చేయడానికి అంగీకరించాడు. ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మించనున్నాడు. కాగా, ఈ చిత్రంలో నటించడానికి రవితేజ పారితోషికం తగ్గించుకోవాల్సింది నిర్మాత కోరగా అస్సలు కుదరదంటూ రవితేజ..ఇలా వీరి మద్య తర్జన భర్జన జరుగుతుందట.
ఇంతలోనే ఈ చిత్రం కథ టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీకి దగ్గర ఉన్నట్లు వార్తలు రావడంతో కథలో మార్పు చేయాల్సిందిగా కోరారట రవితేజ. అవసరం లేదని దర్శకుడు అన్నారని దాంతో వీరి మధ్య వాదన జరుగుతోందనే టాక్ వచ్చింది. ఈ కారణంగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యమవుతోందని చెప్పుకుంటున్నారు. దాంతో ఈ చిత్రం ఎట్టి పరిస్థితిలో ఆగకూడదనే నిర్ణయంతో నిర్మాతలు .. రవితేజ రంగంలోకి దిగిపోయారట.
మరింత సమాచారం తెలుసుకోండి:
vi anand
talluri ram
story problems
re write
remuneration
ap political updates
telangana politics
telugu political news
latest news
latest ap updates
political news
indian politics
international news
national news
tollywood news
bollywood news
kollywood news
mallywood
hollywood movies
latest film news
latest updates