బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు సల్మాన్ ఖాన్. 53 ఏళ్ల వయసులో ఉన్నా సల్మాన్ పెళ్లి వార్తలు ఇప్పటికీ బాలీవుడ్లో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. గత ఏడాది కూడా రొమేనియన్ బ్యూటీ లూలియాను, సల్మాన్ త్వరలోనే వివాహం చేసుకుంటున్నారని వార్తలు తెగ హల్ చల్ చేశాయి..కానీ అది జరగలేదు. అయితే సల్మాన్ ఖాన్ ఎప్పుడు పెళ్లి విషయం గుర్తు చేసినా వచ్చే సంవత్సరం చేసుకుంటా అంటూ దాదాపు 35 ఏళ్ల నుంచి గడుపుకుంటూ వస్తున్నారు. ఆయన సహనటులు అందరూ వివాహం చేసుకొని పిల్లలు కన్నారు..వారు కూడా హీరో, హీరోయిన్లుగా రాబోతున్నారు.
ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముంబై మిర్రర్కిచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ను పెళ్లి గురించి ప్రశ్నించగా.. దిమ్మతిరిగే సమాధానం చెప్పారు సల్మాన్. ‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ వారితో పాటు తల్లి కూడా వస్తుంది. నాకు తల్లి వద్దు.. పిల్లలు మాత్రమే కావాలి. వారిని భద్రంగా చూసుకోవడం కోసం ఓ గ్రామాన్నే సిద్ధం చేసి ఉంచాను’ అన్నారు సల్మాన్.
మరోవైపు తన స్నేహితులు షారూఖ్, ఆమిర్ బాటలోనే సల్మాన్ వెళ్తున్నారని.. సరోగసి విధానం ద్వారా ఆయన తండ్రి అవు తాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ కండల వీరుడు. ప్రస్తుతం సల్మాన్ ‘భారత్’ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. రంజాన్ సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.