మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సినిమాల్లోకి రి ఎంట్రీ ఇస్తూ నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా సూపర్ హిట్ సాధించి, మరొక్కసారి ఆయన బాక్సాఫీస్ స్టామినాని టాలీవుడ్ కి రుచి చూపించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ సినిమా సైరా నరసింహారెడ్డి, ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలయ్యే అవకాశం ఉందట. 

ఇకపోతే మరోవైపు తన తదుపరి 152వ సినిమా కోసం మెగాస్టార్ ఇప్పటికె తన శరీర బరువును తగ్గుంచుకునే పనిలో పడ్డారు. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ మరొక సరికొత్త అవతారంలో దర్శనమివ్వనున్నారట. మెగా ఫ్యాన్స్ ను అలరిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు మంచి మెసేజి ఓరియెంటెడ్ సినిమా గా కొరటాల ఈ కథను రూపొందించడం జరిగిందట. అంతేకాక రేపు విడుదల తరువాత మెగాస్టార్ కు, కొరటాలకు ఇద్దరికీ కూడా ఈ సినిమా మరింత పేరు తెస్తుందని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిన ఈ సినిమాను ఈనెల 22న మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఓపెనింగ్ పూజ కార్యక్రమాలు జరుపాలని యూనిట్ నిర్ణయించినట్లు సమాచారం. 

మెగాస్టార్ సరసన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారని, వారి ఎంపిక కూడా పూర్తయిందని అంటున్నారు. అలానే కొరటాల సినిమాలకు వరుసగా సంగీతాన్ని అందిస్తున్న దేవిశ్రీప్రసాద్ మరొక్కసారి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ప్రారంభ రోజున సినిమాలోని నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల వివరాలు కూడా తెలియచేయనున్నారట. ప్రస్తుతం ఈ వార్త పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నప్పటికీ, ఆ సినిమా యూనిట్ నుండి  ఒక అధికారిక ప్రకటన వెలువడితేనే కానీ పూర్తి విషయాలు తెలియవంటున్నారు సినిమా విశ్లేషకులు.....!!



మరింత సమాచారం తెలుసుకోండి: