సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం1999 లో వచ్చిన 'బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్' అనే ఇంగ్లీష్ సినిమా కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందట. ఆ సినిమా చాలా హిలేరియస్ గా ఉండి థ్రిల్లింగ్ మూమెంట్స్ తో ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో జయం రవి , కాజల్ జంటగా నటిస్తున్న కోమలి కూడా ఇదే కాన్సెప్ట్ తో వస్తుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ చూస్తుంటే సినిమా హిలేరియస్ గా ఉండేలా వుంది. ఒకవేళ రవితేజ డిస్కోరాజా కూడా ఇదే కాన్సెప్ట్ తో వస్తే మాత్రం ఆయన కామెడీ టైమింగ్ తో సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ అవ్వడం ఖాయం.
ఇక ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ , తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. రవితేజ ఫ్రెండ్ పాత్రలో సునీల్ నటిస్తుండగా విలన్ గా కోలీవుడ్ హీరో బాబీ సింహ కానీకనిపించనున్నాడు. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.