బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు సహజం. అయితే గొడవలు జరిగిన తర్వాత ఇద్దరిద్దరు మాట్లాడుకుని గొడవని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే శ్రీముఖి, రాహుల్ ల మధ్య గొడవలు తగ్గేలా కనిపించట్లేదు. వీరిద్దరు వాళ్ల మధ్య ఇష్యూస్ గురించి చర్చించినా కూడా ఎటువంతి ప్రయోజనం లేదు. నిత్యం వారిద్దరి మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. వీరిద్దరూ తరచుగా ఒకరిపై ఒకరు కామెంత్లు చేసుకుంటూనే ఉన్నారు. 


అయితే నాగార్జున గారు రాహుల్ ని ఈ విషయంలో హెచ్చరించేసరికి అప్పటి నుండి రాహుల్ కొంత తగ్గాడనే చెప్పాలి.అయితే శ్రీముఖి మాత్రం తన పంతం నెగ్గించుకోవాలనే ప్రయత్నిస్తుంది. మూడు రోజులుగా తన వరస అలాగే కనిపిస్తుంది. రాహుల్ ఎలిమినేట్ అయ్యే వరకు నామినేట్ చేస్తానని శ్రీముఖి అనడంతో ఇంకా వార్ ఇంకా కొనసాగుతుందనే అనిపిస్తుంది. తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో మరోసారి రాహుల్ పై విరుచుకు పడింది.


హిమజ తో మాట్లాడుతూ రాహుల్ ని ఈ వారం ఎలిమినేట్ అయితే నేను చాలా హ్యపీగా ఫీల్ అవుతాను. కానీ అతను ఎలిమినేట్ అయ్యేట్టు కనబడట్లేదు.పులిహోర రాజా అని పేరు తెచ్చుకున్నాడు కదా అందుకే అంత తొందరగా ఎలిమినేట్ అవడు.  మొదట్లో చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. ఇప్పుడు అసలు ఎక్కువ మాట్లాడట్లేదు. ప్రేమ గుడ్డిది అని మాస్టర్ చెప్పినట్టు అలానే బిహేవ్ చేస్తున్నాడని చెప్పింది.


అవసరం వచ్చినపుడలా రాహుల్ మీద తన కోపాన్ని ప్రదర్శిస్తున్న శ్రీముఖి ముందు ముందు మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది.ఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే తప్పితే వీరిద్దరి మధ్య గొడవలు తగ్గవని భావిస్తున్నారు. అయితే రాహుల్ ఈ వారం ఎలిమినేట్ అయ్యేలా కనబడట్లేదు. దాంతో వీరిద్దరి మధ్య మరింత గ్యాప్ వస్తుందని విశ్లేషిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: