యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'సాహో'. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కి విపరీతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. హై టెక్నికల్ వ్యాల్యూస్ జోడించి షూటింగ్ జరపడం, దాదాపు రెండేళ్ల తర్వాత వస్తున్న ప్రభాస్ హీరోగా వెండితెరపై కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి మరింత రెట్టింపయింది.
ఇదిలా ఉంటే ప్రభాస్ సాహోకి సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో 'బ్యాడ్ బాయ్' వీడియో సాంగ్ విడుదల చేసారు. ఈ పాటలో ప్రభాస్ తో శ్రీలంక భామ జాక్వెలిన్ స్టెప్పులేసింది. ఈ పాట హై రేంజ్లో చిత్రీకరించబడింది. ఈ సాంగ్ ప్రభాస్ అభిమానులతో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్ రొమాన్స్ హైలైట్‌గా నిలిచింది. ముందుగా ఈ వీడియో సాంగ్‌ని సాహో ప్రీ రీలీజ్ ఈవెంట్ లో ప్రదర్శించారు. ఒక రోజు తర్వాత ఈ పాటని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఈ పాటలో పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని, హాట్ హాట్‌గా కనిపిస్తున్న భామల నడుమ ప్రభాస్ ఒక్కడే ఉన్న ఈ సాంగ్ లో చిందులేస్తూ కనిపించడం యూత్ ఆడియన్స్‌కి మాంచి కిక్కిస్తోంది.
అయితే ప్రభాస్ తో ఈ పాటలో నటించడానికి జాక్వెలిన్ రెమ్యునరేషన్ భారీగా తీసుకుందట. సాహో లో ఈ స్పెషల్ సాంగ్‌లో ప్రభాస్‌తో చిందులేసేందుకు గాను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి 2 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారని సమాచారం. ప్రభాస్ పక్కన ఆమె చిందులేయడం ఇదే మొదటిసారి. ఈ సాంగ్ కి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాలు ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఆగస్టు ౩౦ న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.