రెండున్నర గంటల సినిమా అద్భుతాలు సృష్టించగలదు.. అదే రెండున్నర గంటల సినిమా అట్టర్ ఫ్లాప్ అవగలదు. అది ఎంచుకున్న కథ.. తీసే దర్శకుడిని బట్టి ఉంటుంది. కేవలం కథ బాగున్నా కథనం బాగా లేకుంటే సినిమా ఆడేయదు. కథ, కథనాలు రెండు బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది.


బాహుబలితో మాత్రమే రాజమౌళి గొప్ప దర్శకుడు కాలేదు ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుండి హిట్లు కొడుతూనే ఉన్నాడు. తీసే కథను ప్రేక్షకుడికి చేరవేసే క్రమంలో ఏయే అంశాలు ప్రస్థావించాలో.. ప్రేక్షకుల నాడిని పట్టేసిన దర్శకుడు రాజమౌళి. సినిమా మొదలుపెట్టిన దగ్గర నుండి ఎండ్ కార్డ్ పడే వరకు ఎంగేజింగ్ గా ఉంటుంది.


అయితే రాజమౌళికి మిగతా దర్శకులకు తేడా అదే.. రాజమౌళి తన సినిమాలో ప్రతి ఫ్రేం సినిమా కథ చెప్పేదిగా రాసుకుంటాడు. అందుకే అతని సినిమాలు అంత బాగా కనెక్ట్ అవుతున్నాయి. బాహుబలి సినిమాని ప్రేక్షకులు ఎంతగా ఓన్ చేసుకున్నారు అంటే అది రాజమౌళి ప్రతిభ అని చెప్పొచ్చు.


కేవలం భారీ బడ్జెట్ అనుకుంటే సరిపోదు దానికి తగినట్టుగా కథ కథనాలు రాసుకోవాల్సి ఉంటుంది. రాజమౌళి సినిమాలు తీసేందుకు టైం పట్టొచ్చు కాని పక్కా హిట్టు కొడుతుంది. పర్ఫెక్షన్ విషయంలో రాజమౌళి ఏమాత్రం కాంప్రమైజ్ అవడు. బుధవారం రిలీజైన సైరా నరసింహా రెడ్డి సినిమాతో సురేందర్ రెడ్డి కూడా దర్శకుడిగా తన ప్రతిభ చాటాడు. మేకింగ్ పరంగా అతనికి మంచి మార్కులు పడ్డాయి. 


రాజమౌళి సినిమాలే బాక్సాఫీస్ దగ్గర ఎందుకు ఆడుతాయంటే.. సినిమా కోసం తను పెట్టే ఫోకస్.. ప్రమోషన్స్ ఇలా అన్ని విషయాల్లో రాజమౌళి చాలా గొప్పగా ఆలోచిస్తాడు. సినిమా ఓపెనింగ్ దగ్గర నుండి రిలీజ్ వరకు అంతా తానై  నడిపిస్తాడు. అందుకే రాజమౌళి సినిమాలకు తిరుగు ఉండదు. ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా తెరకెక్కుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: