కిరాక్ పార్టీ తరువాత యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. సంవత్సరం క్రితమే విడుదలకావల్సిన ఈ సినిమా అనేక కారణాల వల్ల ఎన్నో సార్లు రిలీజ్ అని చెప్పి వాయిదా వేశారు చిత్ర బృందం. అయితే గతవారం నుండి నానా హడావిడి చేసి ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. యూఎస్ఏ లో ప్రీమియర్స్, అలాగే ఇండియా లో మార్నింగ్ షోస్ పడ్డప్పటినుంచే కాస్త నెగిటివ్ టాక్ వస్తుంది. ఏదో కాస్త ఊహించుకొని వెళ్ళిన ప్రేక్షకులకు అసంతృప్తే మిగిలిందని సమాచారం. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్, ఆపై విజువల్స్ సినిమాకు కొంచం హెల్ప్ అయ్యాయని చెప్పుకుంటున్నారు. అయితే ఫస్టాఫ్ మొత్తాన్ని సెకండ్ హాఫ్ బాగా దెబ్బతీసిందని అదే సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కారణమని జనాలు రివ్యూ ఇస్తున్నారు.
ఫస్ట్ హాఫ్ ను బాగానే డీల్ చేసిన దర్శకుడు టి.ఎన్.సంతోష్ సెకండ్ హాఫ్ లో మాత్రం తడబడ్డాడట.సెకండ్ హాఫ్ లో సీన్స్ అన్నీ తికమకగా అనిపించి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసాడు. ఫస్ట్ హాఫ్ లో పెట్టిన కాన్సన్ట్రేషన్ సెకండాఫ్ లో కూడా పెట్టి కథను ఇంకాస్త ఆసక్తికరంగా చెప్పి ఉంటే నిఖిల్ కి ఈ సినిమా కాస్తైనా ఉపయోగపడేది. తమిళ హిట్ సినిమాని ఇక్కడ ఫ్లాప్ సినిమాగా మలిచారు.
కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'కనితన్'కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా లావణ్య త్రిపాఠి నటించింది. పాపం చాలా రోజులుగా ఈ సినిమా మీదే ఆశలన్ని పెట్టుకున్న లావణ్యకి ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ పడింది. లావణ్యకే కాదు హీరో నిఖిల్ పరిస్థితి కూడా అంతే. మెగాస్టార్ అంతటి వారు వచ్చి సినిమాని ప్రమోట్ చేసినప్పటికి ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఈ సినిమాకు సామ్ సి ఎస్ సంగీతం కూడా పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. రాజ్ కుమార్ ఆకేళ్ల, కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రిజల్ట్ మరో రెండు రోజులాగితేగాని అసలు సంగతి తెలుస్తుంది. ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ గా ఒక కొత్త పాత్ర పోషించినప్పటికి ఈ సినిమా నిఖిల్ కి మైలేజ్ ఇవ్వడం కష్ఠమేనని తెలుస్తోంది.
ఇక నిఖిల్ ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమా 'కార్తికేయ' సీక్వెల్ లో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్ సినిమా ఇప్పుడు అటు హీరో నిఖిల్ ఇటు దర్శకుడు చందూ మొండేటి కి ఎంతో కీలకం. ఈ సినిమా గనక హిట్ అవకపోతే ఈ ఇద్దరి పరిస్థితి చెప్పడం కష్ఠమే.