మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కాలు బయట పెడితే చాలు కామపు కోరల్లో చిక్కుకొని బలైపోతున్నారు మహిళలు. మహిళలపై అత్యాచారాలు చేసే వారిని శిక్షించడానికి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై నే కాదు జంతువులు మగవాళ్ళ పైన కూడా అత్యాచారాలు చేస్తున్నారు కామంతో కళ్లు మూసుకుపోయిన మగాళ్ళు . దీంతో కామాంధుల బారిన పడి చిన్న పిల్లలు మూగ జీవాలు కూడా బలయిపోతున్నాయి.ఇలాంటి ఘటనలు రోజుకోటి తెర మీదకు వస్తున్నాయి.
అయితే సెలబ్రిటీలకు కూడా పలుమార్లు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అని మీ టు ఉద్యమంతో బయట పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎంతో మంది మీ టూ ఉద్యమం పేరుతో తమకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి బయటపెట్టి సంచలనం సృష్టించారు. ఇక తాజాగా టాలీవుడ్ కమిడియన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఇప్పటివరకు కేవలం లేడీ సెలబ్రిటీలు తమపై అత్యాచారం జరిగిందని లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని అంటూ పలు మార్లు చెప్పటం చూశాం. కానీ ఒక ఒక మేల్ సెలబ్రిటీ తనపై అత్యాచారం జరిగింది అని ఎప్పుడైనా చెప్పడం చూసారా..?
కానీ ఇక్కడ ఒక మెయిల్ సెలబ్రిటీ మాత్రం తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించాడు. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరో కాదు టాలీవుడ్ లో తనదైన కామెడీతో అందరినీ కడుపుబ్బ నవ్వించే రాహుల్ రామకృష్ణ.తనను చిన్నప్పుడే రేప్ చేశారు అంటూ సంచలన నిజాన్ని బయట పెట్టాడు. నా బాధను ఎక్కడ ఎవరితో ఎక్కడ పంచుకోవాలో అర్థం కాలేదు అందుకనే ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేద్దామని అనుకున్నాను. అన్ని బాధగానే ఉన్నాయి ... కానీ ఇతరులతో పంచుకోవడం ద్వారానే నేను ఏంటో తెలుసుకోగలుగుతున్న అంటూ ట్విట్ చేసాడు రాహుల్ రామకృష్ణ. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ ట్విట్ చూసి కొంతమంది షాక్ అవుతుండగా ఇంకొంతమంది ధైర్యం చెబుతున్నారు.