ఒక సినిమా మనకి నచ్చితే అందులో హీరో, హీరోయిన్లని గుర్తు పెట్టుకుంటాం. ఇంకా కొద్దిగా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ సినిమా దర్శకుడెవరా అని చూస్తాం. హీరో హీరోయిన్లు తెర మీద కనబడతారు కాబట్టి మనకి గుర్తుంటారు. దర్శకుడు తన మనసులో చూసుకున్న సినిమాని తెరమీద మనకి చూపిస్తాడు కాబట్టి అతడినీ గుర్తు పెట్టుకుంటాం. కానీ ఒక సినిమా తీయడానికి కావాల్సిన వాటన్నింటినీ సమకూర్చే నిర్మాతని మాత్రం గుర్తు పెట్టుకోం.

 

 

ఒక సాధారణ ప్రేక్షకుడికి నిర్మాతలు గుర్తుండరు. కానీ సాధారణ ప్రేక్షకుడు సైతం గుర్తుపెట్టుకునే ఒకే ఒక్క పేరు దిల్ రాజు. నిర్మాతగా అతడు ఎన్నో సినిమాలు చేశాడు. అతడికంటే మరెన్నో సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దిల్ రాజు ఒక్కడికే అంతటి పేరు వచ్చింది. హీరో ఎవరైనా సరే, దిల్ రాజు నిర్మిస్తున్నాడంటే అందులో ఏదో విశేషం ఉండే ఉంటుంది అనేంతలా పేరు తెచ్చుకున్నాడు. అయితే దిల్ రాజు ఇప్పటి వరకు తీసినవన్నీ స్ట్రెయిట్ చిత్రాలే.

 

 


ఏ సినిమాను రీమేక్ చేయలేదు. మొదటి సారిగా దిల్ రాజు ఒక తమిళ చిత్రాన్ని  రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో క్లాసిక్ గా నిలిచిపోయిన ౯౬ మూవీని తెలుగులో సమంత హీరోయిన్ గా శర్వానంద్ హీరోగా జాను అనే పేరుతో తెరకెక్కించారు. ఒరిజినల్ చిత్ర దర్శకుడైన సి ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాని రీమేక్ చేయడం కరెక్ట్ కాదని చాలా మంది చెప్పారట.

 

కానీ దిల్ రాజు ఒరిజినల్ 96 మూవీని రిలీజ్ కి ముందే చూశారట. అప్పుడే ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడట. సినిమా చూసినప్పుడు తాను ఎలా ఫీల్ అయ్యాడో  జాను చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు కూడా అలానే ఫీల్ అవుతారట. సినిమా చూశాక మీరు కూడా ఒప్పుకుంటారని అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: