ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలు అందరికీ వరుస షాక్ లు ఇస్తున్న తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే  ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు భద్రతను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే టిడిపి నేత కళావెంకట్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబుకు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది అంటూ టిడిపి నేత కళావెంకట్రావు వ్యాఖ్యానించారు. నారా లోకేష్ కు భద్రత తగ్గింపు చేశారని... నారా లోకేష్ కు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న... ఇలా భద్రత  తగ్గించడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. కాగా ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  టిడిపి నేత కళావెంకట్రావు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్య కరంగా మారాయి. 

 

 

 అంతేకాకుండా ప్రతిపక్ష నేత అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం భద్రత తగ్గించి వేసిందని... ఒక ప్రతిపక్ష నేత కు భద్రత తగ్గించడం ఏమిటి అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు భద్రతను 146 మంది స్థాయి నుంచి 67 మంది స్థాయికి తగ్గించారు అంటూ టిడిపి నేత కల వెంకట్రావు విమర్శించారు. ఇది ఖచ్చితంగా కక్ష్య సాధింపు చర్య  అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుకు కూడా కొన్ని వర్గాల నుంచి ప్రమాదం పొంచి  ఉందని కళావెంకట్రావు పేర్కొన్నారు. మావోయిస్టుల నుంచి ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి చంద్రబాబుకు థ్రెట్  ఉంది అంటూ కల వెంకట్రావు వ్యాఖ్యానించారు. 

 

 

 కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా... చంద్రబాబు సహా ఆయన కుటుంబీకులకు భద్రతను తగ్గించింది అంటూ ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత కళావెంకట్రావు ఆరోపించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడే కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరికైనా భద్రత తగ్గుతూ ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలో కూడా రాహుల్ ప్రియాంక మన్మోహన్ వీళ్ళందరికీ కూడా మోడీ సర్కార్ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను తొలగించింది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు కూడా భద్రత తగ్గించినట్లు రాజకీయవిశ్లేషకులు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: