తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు ముఖ్యమంత్రిగా తెలంగాణ పోరాట యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావునే ఏన్నుకున్నారు.  కేసీఆర్ అంటే తెలంగాణ జాతిపితగా చూస్తున్నారు.  అరవేళ్ల పోరాటానికి తెరదింపేందుకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడం.. ప్రతి పట్టణ, పల్లె, గల్లీల్లో తెలంగాణ నినాదం రావడంతో అప్పటి యూపీఏ తెలంగాణ ఇచ్చేసింది.  ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా కేసీఆర్ నియమితులయ్యారు.  అప్పటి నుంచి ఆయన చేపట్టిన కార్యక్రమాలు.. తీసుకు వస్తున్న మార్పులు ప్రజలు సంతోషంతో మరోసారి ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకొన్నారు. 

 

అంతే కాదు ఎన్ని పార్టీలు పోటీ చేసినా టీఆర్ఎస్ కే ఎక్కువ గా పట్టం కడుతున్నారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు మట్టికరుచుకు పోతున్నాయి.  తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెప్పనున్నారని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి నియోజకవర్గ అభివృద్ది పథకం కొనసాగిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ది కోసం ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు ప్రతి సంవత్సరం రూ.1కోటి 50 లక్షలు కేటాయించారు.  ఎప్పుడు నిధులు లేవు అనే మాట రాకుండా ఉండాలని.. అభివృద్ది ఎక్కడా కుంటు పడకుండా చూడాలని ఆయన నాయకులకు సూచించారు.   

 

ఈ నిధుల ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తమ నియోజకవర్గంలో అభివృద్ది కోసం స్వంతంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.  గతంలోలాగానే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నిధులు కేటాయించాలని సీఎం భావిస్తునట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గ పరిధిలో నిధులు కేటాయించుకునే అవకాశం ఉంది.  మొత్తానికి తమపై ఉంచిన నమ్మకాన్ని ప్రతి ఒక్క నేత నిలుపుకోవాలని ఆయన అందరికీ సూచించారు.  టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆర్దిక మాంద్యం ప్రభావంతో ఈ నిధులను కేటాయించలేదు. అయితే ఈ సారి బడ్జెట్లో సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ది పథకాన్ని పునరుద్దరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: