ప్రతి హీరో దర్శకుడు తమ సినిమాల గురించి పాజిటివ్‌ గా చెప్పుకుని ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుకునేలా చేసుకోవడం ఫిలిం బిజినెస్ లో ఒక టెక్నిక్. అయితే ఇలాంటి సినిమా ఇండియాలో ఇప్పటిదాకా రాలేదు. ఒక్క క్షణం కూడా తల తిప్పలేని విధంగా సినిమా ఉంటుంది అంటూ హిట్ సినిమా విషయంలో హీరో విశ్వక్సేన్ చేసిన ప్రచారం ఆ సినిమాకు శాపంగా మారింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.    

 

తమిళంలో ఇదే స్టైల్ లో '16' అనే సినిమాకు ఇంతకంటే పకడ్బందీగా తీశాడు కార్తీక్ నరేశ్ అనే యువ దర్శకుడు తీసి సూపర్ హిట్ కొట్టాడు. గతంలో తెలుగులో వచ్చిన అడివి శేష్ మూవీ ‘క్షణం’ కూడ మిస్టరీ స్టైల్ లో సాగే అదిరిపోయే థ్రిల్లర్ దీనికి కూడ మంచి స్పందన వచ్చింది. 

 

అయితే తమ హిట్ మూవీ ముందు ఏ సినిమాలు సరిపోవు అంటూ ‘విశ్వక్సేన్’ చేసిన ప్రచ్చారంతో ఆమూవీ పై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు.  మంచినీళ్లు ఎక్కువ  తాగి ఈ సినిమాకు వస్తే మధ్యలో టాయిలెట్‌ కు వెళ్లలేక ఇబ్బంది పడతారు. ‘పది నిమిషాలు మీరు కూర్చోండి తర్వాత నేను కూర్చోబెడతా’ అంటూ ఈ హీరో అన్న పెద్ద మాటలు ఈ సినిమాకు శాపంగా మారాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి.     

 

ప్రేక్షకులు చాలా ఎక్కువ ఊహించుకుని ఈ మూవీ థియేటర్లకు వెళ్ళడంతో నిరుత్సాహ పడుతున్నారు కాని మామూలుగా చూస్తే ‘హిట్' మంచి థ్రిల్లర్ మూవీ అన్న కామెంట్స్ వస్తున్నాయి. కొత్త దర్శకుడు శైలేష్ ఈ మూవీని బాగానే డీల్ చేసినా విశ్వక్ చెప్పిన స్థాయిలో ఈ సినిమా లేకపోవడంతో పాటు సినిమాలో ఎమోషనల్ కనెక్ట్  మిస్ కావడం టెక్నికల్ డీటైలింగ్ మరీ  ఎక్కువ కావడంతో ఈ మూవీ పై సగటు ప్రేక్షకుడు పెదవి విరుస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ‘విశ్వక్సేన్’ వ్యాఖ్యలు ఈ మూవీకి ఓపెనింగ్స్ కు ఉపయోగపడినా ఈ మూవీ నిర్మాతగా నాని పెట్టుకున్న అంచనాలను అందుకోవడం కష్టం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: