ఈ మద్య స్టార్ హీరోయిన్లు గా వెలిగిపోయిన వారు ఒక్కసారే యూటర్న్ తీసుకొని ఐటమ్ సాంగ్స్ లో మురిపిస్తున్నారు. స్టార్ హీరోల సరసన హీరోయిన్లు గా నటించిన వారే ఐటమ్ సాంగ్ తో దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే తమన్నా, కాజల్, అంజలి, శృతి హాసన్ మరికొంత మంది హీరోయిన్లు స్టార్ హీరోల సరసన ఐటమ్ సాంగ్స్ లో దుమ్మురేపారు. ఇక వీరి బాటలోనే నడవనుంది బాలీవుడ్ బ్యూటీ హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ అంటే తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అవ్వకపోవచ్చు కాని కుమారి 21ఎఫ్ హీరోయిన్ అంటే మాత్రం అందరూ వెంటనే గుర్తు పడతారు. గత కొంత కాలంగా ఈ అమ్మడికి పెద్దగా సక్సెస్ లు ఏమీ లేవు.. అప్పుడప్పుడు సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తుంది.
ఈ మద్య నితిన్, రష్మిక నటించిన ‘భీష్మ’ చిత్రంలో ఇలా కనిపించి అలా వెళ్లిపోయింది. ఇలా చిన్న చిన్న పాత్రలకే పరిమతం అవుతుంది ఈ బ్యూటి. ఇప్పటికే అదే కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్ తో టాలీవుడ్ లో గుర్తిస్తున్నారు అంటే ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఏ మేరకు గుర్తింపు ఉందో చూసుకోవచ్చు. తాజాగా రెడ్ చిత్రంతో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో రామ్. షూటింగ్ చివరి దశలో ఉన్న రెడ్ చిత్రం ఓ ఐటెమ్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది.
ఈ పాటకు హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ రామ్‌తో రొమాన్స్ చేయబోతుంది. ఈ పాట కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్ కూడా ఏర్పాటు చేయగా… జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ భామ అందాల విందు అందించే విధంగా ఈ ఐటమ్ సాంగ్ ఉంటుందని టాక్. ఈ సాంగ్ హిట్ అయితే కొద్ది రోజుల పాటు తెలుగులో మరో ఐటెం భామగా పాటలకి స్టెప్పులు వేసే అవకాశం సొంతం చేసుకొని కెరియర్ సాఫీగా సాగించేస్తుంది.