కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వర్లు రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభమైంది. ఈ విషయం తెలిసిందే. అయితే.. దివంగత సీఎం ఎన్టీఆర్ కు పిచ్చి అభిమాని కొడాలి నాని. అంతేకాదు ఈయన ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణను తన రాజకీయ గురువుగా చెప్తుంటారు కొడాలి నాని. తనకు హరికృష్ణనే రాజకీయ జీవితాన్ని ఇచ్చారని నాని చెప్తుంటారు. తన రాజకీయ జీవితం హరికృష్ణతోనే ప్రారంభమైందని ఎల్లప్పుడూ గుర్తుచేసుకుంటారు. హరికృష్ణతో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని ఆయన వెల్లడించారు.

 

 

తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ.. ఇప్పటికీ ఎన్టీఆర్ కు వీరాభిమానిని అంటూ చెప్తూనే ఉంటారు. 2004లో గుడివాడ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు కొడాలి నాని.. అలియాస్ కొడాలి వెంకటేశ్వర్లు.

 అయితే.. నాని అసెంబ్లీ లోపల బయట చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపించారు. ఎన్నికల ప్రచారంలో గుడ్డలూడదీసి కొడతారు, నీ అంతు చూస్తా అంటూ చంద్రబాబు పై విరుచుకు పడ్డారు ఈయన. 2009లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత వైయస్ జగన్ వెంట నడిచారు. వైయస్ జగన్ స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన పై అనర్హత వేటు సైతం పడింది. ఆ తర్వాత స్థానిక ఉప ఎన్నికల్లో సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు.

 

తన దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న నాని తన పక్కలో బళ్లెంలా తయారవ్వడం పై చంద్రబాబు ఆగ్రహంతో రగిలిపోయాడు. కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు వ్యూహాలు రచించినప్పటికీ ఆయన వ్యూహాల ముందు అవన్నీ ఫెయిల్ అయ్యాయని కొడాలి అన్నారు.

 

దమ్ముంటే నన్ను ఓడించు అంటూ సవాల్ విసిరిన కొడాలి నాని తానేంటో నిరూపించుకున్నారు. ఎన్నికల్లో ప్రజల మనసు గెలుచుకున్న ఆయన పార్టీ పట్ల విధేయతతో జగన్ కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: