సినిమాల్లో హీరోలకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సినిమాలో ఎవరు హీరోగా నటిస్తున్నారు అనే దాన్ని బట్టే ఆ సినిమాకు క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. అయితే కేవలం సినిమాలో హీరో మాత్రమే ఉంటే సరిపోదు కదా... సినిమాలో స్టార్ హీరో వుంటే ఆ స్టార్ హీరో ని ఢీకొట్టే... స్టార్ విలన్ కూడా ఉండాలి. అలా సమవుజ్జీ ఉన్నప్పుడే ప్రేక్షకులు కూడా ఆ సినిమాను యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా బలవంతుడైన హీరో బలహీనుడై విలన్ ఉంటే  మాత్రం ఆ సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చదు. అయితే ప్రస్తుతం సినిమాలలో చాలా మంది మహిళలు ఉన్నారు. కానీ ఒకప్పుడు మాత్రం ఏ హీరో సినిమా అయినా... ఎలాంటి సినిమా అయినా విలన్ మాత్రం ఆయన ఒక్కడే. 

 

 

 స్టార్ హీరోలందరిని  ఢీకొట్టి... విలన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు. అప్పట్లో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయి... వందల సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రామిరెడ్డి. అప్పట్లో రామిరెడ్డి విలన్ గా  లేని సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోల సినిమాల్లో... హీరోలను ఢీకొట్టే అసలుసిసలైన విలన్ గా రామిరెడ్డి తన నటనతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు తన విలనిజానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఆయనను తీసుకునేవారు. అందుకే టాలీవుడ్ లో ఎంతమంది విలన్లు ఉన్నప్పటికీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. 

 

 

 అయితే కేవలం స్టార్ హీరోల సినిమాల్లోనే కాదు.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అంకుశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రామిరెడ్డి మొదటి సినిమాతోనే స్టార్ విలన్ గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత రామిరెడ్డి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా రామి రెడ్డి నటించిన అంకుశం సినిమాతో పాటు... అమ్మోరు సినిమా కూడా ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. అమ్మోరు సినిమా లో మాంత్రికుడు పాత్రలో రామిరెడ్డి నటన ఎంతో మందిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత ఒసేయ్ రాములమ్మ,  హిట్లర్,  జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాల్లో కూడా రామిరెడ్డి నటనకు ఎన్నో అవార్డులు సైతం దక్కాయి అంటే ఆ రోజుల్లో రామిరెడ్డి ఎంత స్టార్ విలన్ గా కొనసాగాడు అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: