గత కొన్ని ర్రోజులుగా వరస పెట్టి సినిమాలు చేస్తూ మరొకవైపు రాజకీయాలను కొనసాగిస్తున్న పవన్ లేటెస్ట్ మూవీలకు సంబంధించిన ఫోటోలు బయటకు లీక్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ కు పూర్వ ప్రాభవం తిరిగి వస్తోంది అంటూ అభిమానులు ఆనందపడ్డారు. అయితే ఇలాంటి పరిస్థితులలో ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన ‘జనతా కర్ఫ్యూ’ కు తన సంఘీభావం తెలియచేస్తూ ఈ కర్ఫ్యూలో స్వచ్చందంగా అందర్నీ పాల్గొనమని చెపుతూ పవన్ రిలీజ్ చేసిన వీడియోలో పవర్ స్టార్ ఒరిజినల్ లుక్ చూసి అభిమానులు ఖంగారు పడిపోతున్నారు. 


ఒకప్పుడు యూత్ ఐకాన్ గా పిలిపించుకునే పవన్ కళ్యాణ్ లుక్ లో గ్రేస్ తగ్గిపోయిందని వయసు భారం కనిపిస్తోందని ఏకంగా అతడి అభిమానులే గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం పవన్ ఎదుర్కుంటున్న ఒత్తిళ్ళతో ఇలాంటి లుక్ వచ్చిందని సినిమాలలో మేకప్ తో ఎంత కవర్ చేసినా పవన్ లుక్ లో గ్రేస్ లేకపోతే సగటు ప్రేక్షకుడు పవన్ సినిమాలను చూడకపోతే పరిస్థితి ఏమిటి అంటూ అభిమానులు ఆందోళన పడుతున్నారు. 


ఇది ఇలా కొనసాగుతూ ఉండగా పవన్ రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటూ కూడ ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ ప్రకటనపై కూడా లేటుగా స్పందించడం స్థానిక బీజేపీ నేతలకు కోపం తెప్పించింది అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కరోనాపై మోడీ ప్రకటన విడుదల అయిన తరువాత 12 గంటలు ఆలస్యంగా పవన్ స్పందించడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. 

 

వాస్తవానికి మోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ అంశానికి సంబంధించి పవన్ తో ఓ వీడియో తయారుచేసి రిలీజ్ చేయించాలని ఏపీ బీజేపీ భావించింది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన వీడియోను తన వ్యక్తిగత స్థాయిలో విడుదల చేయడంతో పవన్ కు స్థానిక బిజెపి నాయకుల మధ్య ఇంకా గ్యాప్ కొనసాగుతూనే ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: