యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో మాస్ హీరోగా ప్రత్యేక స్థానం ఉంది. బాల నటుడిగా మొదలైన ఆయన నట ప్రస్థానం అతి తక్కువ కాలంలోనే వేగం అందుకుంది. హీరోగా చేసిన నిన్ను చూడాలని సినిమా కంటే మూడేళ్ల ముందే ఓ సంచలన సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రెడ్డి నిర్మాణంలో శబ్దాలయా ధియేటర్స్ బ్యానర్ పై దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన ‘రామాయణం’ సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలై నేటికి 24ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

1996 ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పాందింది. తాత ఎన్టీఆర్ అంశతోనే రాముడి పాత్రతో తెరంగేట్రం చేశాడు ఎన్టీఆర్. రాముడి పాత్రకు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకుని స్థిరపడిపోయిన నటుడు ఎన్టీఆర్. ఆయన మనవడిగా ఆయన పోలికలతోనే ఉన్న జూ.ఎన్టీఆర్.. ఈ సినిమాలో రాముడి పాత్రతోనే తెరంగేట్రం చేయడం యాధృచ్చికమే. మొత్తం బాలనటులతోనే ఈ సినిమాను తెరకెక్కించాడు గుణశేఖర్. వీరందరికీ నటనలో తర్ఫీదును ఇప్పించి సినిమా తీసి పెద్ద సాహసమే చేశారు ఎంఎస్ రెడ్డి. గుణశేఖర్ మాయాజాలంతో ఈ సినిమా అద్భుతంగా ఆడింది. రాముడి పాత్రలో ఎన్టీఆర్ కు మంచి మార్కులు పడ్డాయి.

IHG

 

ఈ సినిమాతో నందమూరి వంశం నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కారణమైంది. రాష్ట్రస్థాయి అవార్డులతో పాటు జాతీయస్థాయిలో చిన్న పిల్లల సినిమా విభాగంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. స్మితా మాధవ్ సీతగా, స్వాతి బాలినేని రావణుడిగా నటించారు. ఈ సినిమా తర్వాత మూడేళ్లకు నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: