తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది మాలీవుడ్ బ్యూటీలో తమ అందచందాలతో కట్టిపడేశారు. అలాంటి హీరోయిన్లలో నిషా కళ్ల సుందరి త్రిష ఒకరు.  చెన్నై మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.  తరుణ్ హీరోగా నటించిన ‘నీ మనసు నాకు తెలుసు' అంటూ తెలుగు నాట అడుగు పెట్టింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘వర్షం’ మూవీతో మంచి విజయం అందుకుంది. ఆ వెంటనే ప్రభుదేవ దర్శకత్వంలో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సిద్దార్ధ సరసన నటించి మంచి విజయం అందుకుంది.  ఇప్పటి వరకు త్రిష 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.

 

ఇండస్ట్రీలోకి ఈ అమ్మడు అడుగు పెట్టి ఇరవైఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. ఇక వెంకటేశ్ సరసన త్రిష తొలిసారి నటించిన సినిమా 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే'.  అయితే ఈ అమ్మడు నటించిన మూడు చిత్రాలకు  ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందించాయి. గత కొంత కాలంగా యంగ్ హీరోయిన్స్ తో పోటీపడలేక త్రిష కెరీర్ కాస్తంత డల్ అయ్యింది.  త్రిష రీల్ లైఫ్ లో ఎంత అందమైన జీవితమో.. రియల్ లైఫ్ లో అన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి.  2015 సంవత్సరం తమిళ నిర్మాత వరుణ్ మనియన్‌తో త్రిష వివాహం ఖరారైంది.

 

అప్పట్లో నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది.   ఈ అమ్మడి ప్రేమ వ్యవహారం పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది.. అయితే తాను మాత్రం తన ఇష్టమైన వ్యక్తినే చేసుకుంటానని.. పెద్దల కుదిర్చిన పెళ్లికి నో చెబుతుంది.  ఏదిఏమైనా ఓ హీరోయిన్ 20 ఏళ్ల పాటు వన్నెతగ్గని గ్లామర్ మెయిన్‌టైన్ చేస్తూ క్రేజ్ పెంచుకోవడం త్రిషలో స్పెషల్ క్వాలిటీగా చెప్పుకోవచ్చు.  నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న త్రిష కి ఇండియాహెరాల్డ్.కామ్ తరుపున శుభాకాంక్షలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: