రాజమౌళి కోస్తా జిల్లాలకు చెందిన వ్యక్తి కావడంతో అతడి సినిమాలలో ఇప్పటి వరకు ఎప్పుడు తెలంగాణ ఛాయలు కాని తెలంగాణ యాస కాని కనిపించలేదు. అయితే తెలంగాణ ప్రాంతంలో కూడ రాజమౌళికి ఆంధ్రా ప్రాంతానికి మించిన అభిమానులు ఉన్నారు. 


ఇలా తెలంగాణ ప్రజల అభిమానాన్ని పొందిన రాజమౌళికి ఊహించని విధంగా కరోనా తెలంగాణ ప్రాంత ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలియచేసుకునే లా మారుస్తూ ఉండటంతో కరోనా ఎలాంటివ్యక్తిని అయినా పరిస్థితులతో రాజీ పడేలా చేస్తుంది అన్నవిషయం మరొకసారి రుజువైంది. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లకు ఏర్పడిన బ్రేక్ కు ఒక పరిష్కారం రాజమౌళికి నల్గొండ ప్రాంతంలో దొరకడం వెనుక అనేక వ్యూహాలు సెంటిమెంట్లు ఉన్నాయి అంటున్నారు. 


ఈ సినిమాకు సంబంధించి అత్యంత కీలకంగా మారిన పూణే షెడ్యూల్ ఒకసారి చరణ్ కు జరిగిన ప్రమాదం వలన వాయిదా పడితే మరోసారి  కరోనా కారణంగా పూణే షెడ్యూల్ వాయిదా పడింది. ప్రస్తుత కరోనా పరిస్థితులలో రాజమౌళి పూణే వెళ్ళలేడు కాబట్టి నల్గొండ ప్రాంతంలోని కొన్ని పురాతన కోటలు ఆ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతం రాజమౌళిని నల్గొండ వైపు మళ్ళించే లా చేసింది. 


దీనికితోడు నల్గొండ జిల్లాలోని భారీ కట్టడాలు బ్రిటిష్ కాలంనాటి సంస్కృతిని ప్రతిబింబించేవిగా ఉండటం కూడ రాజమౌళి నిర్ణయానికి ఒక కారణం అని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో జూనియర్ నటిస్తున్న కొమరం భీమ్ తెలంగాణా ప్రాంతానికి చెందిన యోధుడు కావడంతో సెంటిమెంట్ గా కూడ కలిసి వస్తుందని రాజమౌళి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు అని అంటున్నారు. కారణాలు ఏమైనా తెలంగాణ గడ్డకు ‘ఆర్ ఆర్ ఆర్’ లో స్థానం లభించడం తెలంగాణ ప్రాంత ప్రజలు అందరు ఆనందించే విషయం. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రాజమౌళికి ఖాళీ దొరకడంతో ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటల ట్యూన్స్ ను ఫైనల్ చేసి వాటిని రికార్డ్ చేసే పనులులలో జక్కన్న బిజీగా ఉన్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: