రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతు ఉండటంతో ఈ కేసుల సంఖ్య ఈ నెలాఖరుకు ఏస్థాయికి చేరుకుంటుందో ఎవరి ఊహలకి అందడం లేదు. దీనితో సినిమా ధియేటర్స్ కనీసం మరో రెండు నెలలకు అయినా ప్రారంభం అవుతాయి అనే నమ్మకాలు ఇండస్ట్రీ వర్గాలలో రోజురోజుకి తగ్గిపోతోంది.

 

ఈ పరిస్థితులలో రిలీజ్ కు రెడీగా ఉన్న మిడిల్ రేంజ్ సినిమాల పరిస్థితి అత్యంత అయోమయంగా మారింది. ప్రస్తుతం విడుదలకు రెడీగా ఉన్న మిడిల్ రేంజ్ సినిమాల పై నిర్మాతల పెట్టుబడి సుమారు 300 కోట్లకు పైగా బ్లాక్ అయిపోవడంతో ఈ సినిమాల నిర్మాతలు ప్రస్తుతం వడ్డీలు కట్టలేక బయటపడే మార్గం లేక పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నట్లు సమాచారం.


ప్రస్తుతం విడుదలకు రెడీగా ఉన్న ‘ఉప్పెన’ ‘నిశ్శబ్దం’ సినిమాలను ప్రముఖ ఓటీటీ సంస్థలు 25 కోట్లకు కొనడానికి ముందుకు వస్తున్నా ఆ డబ్బుతో ఈ సినిమాల నిర్మాతలు సమస్యల నుండి గట్టెక్కే అవకాశం లేదు అని అంటున్నారు. ఇక దిల్ రాజ్ ‘వి’ సినిమాకు సంబంధించి ఓటీటీ సంస్థల నుండి మంచి ఆఫర్లు వస్తున్నా నాని పెద్దగా ఆసక్తి కనపరచడంలేదని టాక్. ‘ఇస్మార్ట్ శంకర్’ తో మంచి జోష్ లోకి వెళ్ళిపోయిన రామ్ తన ‘రెడ్’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు.

 

ఇప్పుడు ఈ సినిమాను ఒటీటీ లోకి తీసుకువెళితే తాను ఆశించిన లాభాలు రావని రామ్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రవితేజ గోపీచంద్ మలినేని ల సినిమా ‘క్రాక్’ కు ఇంకా పది హేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటం తో ఈమూవీ రైట్స్ గురించి ఒటీటీ సంస్థలు ప్రయత్నాలు చేద్తున్నా ఈ మూవీ నిర్మాతలు స్పందించడం లేదని తెలుస్తోంది. ఇలా ఈ మీడియం రేంజ్ సినిమాలతో పాటు షూటింగ్ చివరిదశలో ఉన్న నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాలు కూడ తమకు వస్తున్న ఓటీటీ ఆఫర్ల పై కన్ఫ్యూజ్ అవుతూ ఓటీటీ ఆఫర్లను పూర్తిగా తిరస్కరించలేకా అదేవిధంగా మనస్పూర్తిగా ఒప్పుకోలేక బయటపడే మార్గాలు లేక పూర్తిగా అయోమయ స్థితిలో పడిపోయినట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: