ముంబైలో పుట్టి పెరిగిన కన్నడ భామ పూజా హెగ్డే నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఒక‌లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది వ‌రుణ్‌ తేజ్ డెబ్యూ మూవీ ముకుంద‌లో హీరోయిన్‌ గా న‌టించినా ఈ రెండు సినిమాలు హిట్ కాలేదు సరికదా ఈమెకు పెద్దగా పేరు తెచ్చింది లేదు. ఎన్నో ప్రయత్నాల అనంతరం దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ తో స్టార్ట్ అయిన ఆమె విజ‌య‌ప‌రంప‌ర అల వైకుంఠ‌పుర‌ములో వ‌ర‌కు సాగింది. దువ్వాడ జగన్నాధం సినిమా మొదలు ఆమె సౌత్ లో టాప్ హీరోయిన్‌ గా ఉంది.

 వరుస హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తోంది పూజాహెగ్డే. ఈమె ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్, అలానే అఖిల్ అక్కినేని లీడ్ రోల్ లో నటిస్తోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నారు. ఇవి కాక మరో రెండు బాలీవుడ్ మూవీస్ లో ఆమె హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.  తమిళ సినిమా ముగమూడితో సినీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, తెలుగు సినిమాల వలన పాపులర్ అయింది.

ఆ పాపులారిటీతో హృతిక్ రోషన్ తో మొహెంజో దారోలో నటించింది. ఈ నటి ఆ సినిమాతోనే బాలీవుడ్ పరిశ్రమకు తన నటనా సామర్థ్యాన్ని చూపించింది. అప్పటి నుండి ఆమె అక్కడ కూడా టాక్ ఆఫ్ ది టౌనే. అయితే ఈమె పేరిట ఉన్న రికార్డు మరే హీరోయిన్ పేరిటా లేదట. ఆ రికార్డ్ ఏమిటంటే ? ఈమె టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ బాషలలో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డ్ కి నామినేట్ అయింది. ఇప్పటిదాకా అలా మరే హీరోయిన్ కి జరగలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: