ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత హీరో రామ్ చేసే సినిమా అంటే దానికి ఎంతక్రేజ్ ఉండాలి. థియేటర్ బిజినెస్ ఓ రేంజ్ లో సాగాలి. కానీ అది సాధ్యపడటం లేదు. సంక్రాంతికి విడుదల కావాల్సిన హీరో రామ్ 'రెడ్' సినిమాకి అనుకున్నంత రేటు పలకలేదని తెలుస్తోంది. తెలుగుతోపాటు, హిందీలో కూడా ఈ సినిమా విడుదల కావల్సి ఉన్నా.. బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదట.

లాక్ డౌన్ టైమ్ కి రామ్ 'రెడ్' మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే థియేటర్లు లేకపోవడంతో దీన్ని బైటకు వదలలేకపోయారు. మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫామ్ లనుుంచి రెడ్ మూవీపై విపరీతమైన ఒత్తిడి వచ్చింది. ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేసి మరీ ఈ సినిమా తీసుకోవాలని చూశారు. కానీ రామ్ మాత్రం ఇస్మార్ట్ శంకర్ హిట్ మేనియాలోనే ఉన్నారు. థియేటర్లలోనే తన  సత్తాచూపిస్తానంటూ ఓటీటీ ఆఫర్లకు నో చెప్పారు. సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా పూర్తికావడంతో రామ్ మాటకు ఎదురు లేకుండా పోయింది.

తీరా ఇప్పుడు ఓటీటీలను కాదని, థియేటర్లకు ఫిక్స్ అయ్యాక మంచి రేటు రావడంలేదని బాధపడుతున్నారు నిర్మాతలు. సంక్రాంతి నాటికి థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే ఓ అంచనాకి రాలేం. ప్రస్తుతానికయితే ఇతర రాష్ట్రాల్లో థియేటర్ల ఓనర్లు ధైర్యం చేసినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా హాళ్లు తెరుచుకోలేదు. ఒకవేళ సంక్రాంతినాటికి పరిస్థితులు సర్దుకున్నా.. సీటింగ్ విషయంలో తకరారు మొదలవుతుంది. 50శాతం సీటింగ్ తో థియేటర్లు నడపాలంటే కష్టమే. ఆమేరకు కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయినా కూడా రామ్ మాత్రం థియేటర్లవైపే మొగ్గు చూపారు.

మరోవైపు సంక్రాంతికి అఖిల్ సినిమా సహా.. మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. ఇప్పటినుంచే సంక్రాంతి విడుదల అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రామినెంట్ గా కనిపిస్తున్న ఇలాంటి సినిమాలకు థియేటర్ల బిజినెస్ బాగానే సాగుతున్నట్టు సమాచారం. అయితే రెడ్ మూవీకి మాత్రం ఎక్కడో తేడా కొట్టినట్టు తెలుస్తోంది. రామ్ సరసన మాళవిక శర్మ నటించిన ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకుడు. ఓటీటీలపై రామ్ నిర్ణయం సరైనదా కాదా అని తెలుసుకోవాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: