ఈ ఏడాది మొదట్లో 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ లు. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను తిరగరాసి నాన్ బాహుబలి రికార్డ్స్‌ లో టాప్ ప్లేస్‌ లో నిలిచింది. అంతే కాదు విడుదలై నెలలు గడుస్తున్నా ఆ సినిమా రికార్డులకు బ్రేకుల్లేవా అన్నట్టు దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ లోని ''బుట్టబొమ్మ'' సాంగ్ టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

  

దీంతో బన్నీ ఖాతాలో మరో రికార్డ్ చేరినట్లయింది. మొదటి నుంచే 'బుట్టబొమ్మ' పాట రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇక యూ ట్యూబ్‌ లో ఈ పాటకు ఇప్పటికీ భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పటికే అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటగా 'బుట్టబొమ్మ' సాంగ్ రికార్డు క్రియేట్ చేసిన సాగతీ తెలిసిందే. అలానే ఆ మధ్య 2 మిలియన్లకు పైగా లైక్స్ సాధించిన తొలి తెలుగు వీడియో సాంగ్‌ గా కూడా మరో రికార్డు నెలకొల్పింది.

  

ఇక తాజాగా ఈ పాట 450 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ పాట 400 మిలియన్ల వ్యూస్‌ సాధించినట్లుగా చెబుతూ ఈ సినిమాని నిర్మించిన హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ సంస్థ ఓ పోస్టర్‌ ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఈ ఒక్క పాట మాత్రమే కాక 'సామజవరగమన', 'రాములో రాముల' పాటలు సైతం మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈరోజుకీ అల వైకుంఠపురములో ఆల్బమ్‌ కి వస్తున్న ఈ రెస్పాన్స్ చూస్తుంటే మరిన్ని రికార్డ్స్ సొంతం చేసుకోవడం ఖాయం అనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: